ఇదో పెద్ద సంకట పరిస్థితి. ఏపీ అధికార పార్టీ.. వైసీపీలో తీవ్రస్థాయిలో జరుగుతున్న అంతర్మథనం. ఇటీ వల వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ ఒకటి.. ప్రజల మధ్యకు వెళ్లి.. మూడు రాజధానుల విషయాన్ని చర్చకు పెట్టింది. దీనిపై వారి నుంచి అభిప్రాయాలు కోరింది. మరీముఖ్యంగా.. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెబుతున్న విశాఖ, కర్నూలు వాసుల్లో అభిప్రాయం ఎలా ఉందనేది .. ఈ ఛానల్ తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కర్నూలు విషయాన్ని చర్చించుకుంటే.. హైకోర్టు రావడంపై.. కొంత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రజ లు ఆసక్తిగానే స్పందించారు. అయితే.. మరికొందరు మాత్రం.. ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కేవలం.. రోడ్లు బాగుపడతాయేమోనని వ్యాఖ్యానించారు. అయితే.. కర్నూలులో మాత్రం పెద్దగా వ్యతిరేక రాలేదు. కానీ, విశాఖ జిల్లాలో మాత్రం.. పాలనా రాజధానిపై ప్రజల స్పందన మిశ్రమంగా కనిపించింది. ఈ సర్వే.. వివరాలు.. అన్నీ కూడా యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మూడు రాజధానులపై జనాలను ఒప్పించే దెలా? అని వారు గుసగుసలాడుతున్నారు. సీఎం జగన్ అయితే.. ప్రజలు అందరూ కూడా.. మూడుకు అనుకూలంగానే ఉన్నారనే అభిప్రాయంతో ఉన్నారని.. నేతలు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని.. ప్రతిపక్షాలు.. ప్రత్యర్థులు చేసిన ప్రచారం ముందు.. మూడు రాజధానుల వ్యవహారం తేలిపోయిందని అంటున్నారు.
పైగా.. అమరావతి రైతుల సెంటిమెంటు కూడా.. పనిచేస్తోందని నాయకులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ రైతులకు బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై.. తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 30, 2022 3:26 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…