జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ పోలీసులకు సూటిగా ఒక ప్రశ్న సంధించారు. ఈ క్రమంలో పవన్ ప్రశ్నకు.. ఆన్సర్ ఉందా? పోలీసులూ.. అంటూ.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. న్యాయమూర్తులను కించపరిచినవారిని ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీశారు. పోలీసులకు చేతకాదా? అని ప్రశ్నించారు. దీనిపైనే నెటిజన్లు.. పోలీసులను నిలదీస్తున్నారు. మరి పవన్ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన.. వార్తను జర్నలిస్టుల గ్రూప్‌లో పోస్ట్ చేశారని పవన్ అన్నారు. అరెస్టు, కుట్రపూరిత నేరం కింద సెక్షన్ల నమోదు చూస్తుంటే.. జగన్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని అనిపిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్ చేశారంటూ 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి సివిల్ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అరెస్టు చేసినట్లుగానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. జర్నలిస్ట్ అంకబాబుకు గుంటూరు సీఐడీ కోర్టులో ఊరట లభించింది.
గురువారం విజయవాడలో అంకబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు… ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అంకబాబును రిమాండ్‌కు తరలించాలని సీఐడీ న్యాయవాదుల వాదనలు వినిపించగా.. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. ఈ పరిణామాలపైనే.. పవన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులను.. రాజకీయ నేతలను అరెస్టు చేస్తున్న ఈజీగా..హై కోర్టు న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారిని కూడా అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. దీనినే.. నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సీఐడీ అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 9:34 pm
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…