వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి మార్గాల్లో పాదయాత్ర చేయటం కూడా ఒకట. అంటే చంద్రబాబు పాదయాత్ర చేస్తారని కాదు. ఆయన కొడుకు నారా లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చేఏడాడి జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవం రోజున పాదయాత్ర ఆరంభించాలని ముహూర్తం రెడీ చేసుకున్నట్లు ప్రచారం మొదలైంది.
తన పాదయాత్రను లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించేట్లుగా ప్లాన్ చేస్తున్నారట. పాదయాత్రను 2023 జనవరిలో మొదలు పెట్టి 2024 మార్చిలో ముగించేట్లుగా డిజైన్ చేస్తున్నారట. దాదాపు ఏడాదికిపైగా చేయాలని అనుకుంటున్న పాదయాత్రలో దాదాపు 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేట్లుగా ప్లాన్ చేస్తున్నరు. ఇందులో కూడా వైసీపీ బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కవ రోజులు సాగేట్లు అనుకుంటున్నారట.
2024 ఏప్రిల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని అనుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ చూస్తే మార్చివరకు సాగేట్లుంది. అంటే ఎన్నికల షెడ్యూల్ కు కొద్దిరోజుల ముందు పాదయాత్రను ముగించాలని బహుశా లోకేష్ అనుకుంటున్నారేమో. పాదయాత్ర ఇలా ముగియటం ఎన్నికల షెడ్యూల్ అలా ప్రకటన రావటం దాదాపు ఒకేసారి జరుగుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు ఇపుడు నిర్వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కొద్ది నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను నియమించటం, మరికొద్ది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను కూడా ప్రకటిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి మొత్తం 175 నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల ప్రకటనపై ఒక క్లారిటి వచ్చేయాలని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారట. చూస్తుంటే పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా కొందరు అభ్యర్ధులను ప్రకటించేట్లే ఉన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ కొందరు అభ్యర్ధులను ప్రకటిస్తే తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల నుండి మరింత జోష్ పెరుగుతుందనే యోచనలో ఉన్నారట. పాదయాత్ర ప్రారంభించాలని అనుకుంటున్న సమయానికి ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి.
This post was last modified on September 18, 2022 2:22 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…