అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చిన హామీలిచ్చేస్తున్నారు. తన హామీలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమన్న విషయంపై రాహుల్ కసరత్తు చేశారా లేదా అన్నదే అర్ధం కావటం లేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. పరివర్తన్ యాత్రలో గుజరాత్ లోని అహ్మదాబాద్ రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.
అలాగే రైతులకు రుణమాఫీ చేస్తారట. మూడు లక్షల రూపాయల వరకు ప్రతిరైతుకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇంగ్లీషు స్కూళ్ళల్లో అమ్మాయిలకు ఉచిత విద్యను అందిస్తారట. కోవిడ్ కారణంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు రు. 4 లక్షల పరిహారం ఇస్తామన్నారు. 300 యూనిట్ల విద్యుత్ వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి హామీలిచ్చే ముందు మిగిలిన రాష్ట్రాల పరిస్ధితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రు. 500 కే గ్యాస్ సిలిండర్ గుజరాత్ లో మాత్రమే ఇస్తారా ? మరి మిగిలిన రాష్ట్రాల్లోని వినియోగదారుల మాటేమిటి ? రు. 3 లక్షల వరకు ప్రతిరైతుకు రుణమాఫీ చేస్తానన్నారు. మిగిలిన రాష్ట్రాల్లోను రైతులున్నారు కదా. మరి వాళ్ళ రుణాల సంగతి ఏమిటి ? కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు తలా రు. 4 లక్షల పరిహారం ఇస్తామన్నారు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంతోమంది చనిపోయారు కదా మరి వాళ్ళ మాటేమిటి ? అమ్మాయిలకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఉచిత విద్య హామీ కూడా ఉంది. ఇవన్నీ గుజరాత్ కు మాత్రమే పరిమితమైన సమస్యలు కాదు. యావత్ దేశానికి సంబంధించిన సమస్యలు. ప్రాంతీయ పార్టీలు హామీలిచ్చాయంటే ఏదోలే అనుకోవచ్చు. ఇపుడు గుజరాత్ కు ఇచ్చిన హామీలనే రేపు ఇతర రాష్ట్రాల్లోను ముఖ్యంగా అధికారంలో ఉన్న చత్తీస్ ఘర్, రాజస్ధాన్లో జనాలే డిమాండ్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఏమిచేస్తుంది ?.
This post was last modified on September 6, 2022 6:28 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…