ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని.. పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన చెన్నుపాటి గాంధీపై దాడిని చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కింధగా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
గాంధీపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చెన్నుపాటికి గాంధీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శనివారం విజయవాడలో వైసీపీ నేతల దాడిలో చెన్నుపాటి కంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్ప్రతిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఓడిపోతామనే పిరికితనంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు. కన్నుపొడవడం దుర్మార్గమని ఈ ఘటనలో దోషులకు శిక్ష పడే వరకు న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. విజయవాడలో గతంలో టీడీపీ నేత పట్టాభిపై దాడి చేశారని, ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చేసిన పని అని, మీ కుటుంబాలకు ఇదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.
మాకు సొంత అజెండాలేమీ లేవని చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తలు పోరాడేది ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పైనేనని, తమకు సొంత అజెండాలేమీ లేవని చెప్పారు. వైసీపీ అరాచకాలపై ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందని, ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఎన్నో సంక్షోభాలను చూశామని, దాడులు చేసిన వారిని పతనావస్థకు తీసుకెళ్లిన పార్టీ టీడీపీ అన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి ఘటన ఎమోషన్‌లో జరిగిందని పోలీసులు చెబుతారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యారాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
This post was last modified on September 6, 2022 6:16 am
అడిగింతే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…