రాజకీయాల్లో ఉన్న నాయకులు.. ప్రజల నాడినిపట్టుకోవాల్సిందే. ప్రజలను మెప్పించేలా తమ వ్యూహాలు ఉండాలి. ఈ వ్యూహాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. తీవ్రమైన దెబ్బపడిపోతుంది. దీనిని గ్రహించకపోతే. కష్టమే.! ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొన్ని రోజులుగా.. ఒక మాట చెబుతున్నారు. తమ లక్ష్యం.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని! అంటే.. వైసీపీ లేని ఏపీ కావాలని. ఈ లక్ష్యం కోసమే.. వచ్చే ఎన్నికల్లో తాము పనిచేస్తామని అంటున్నారు.
అవసరమైతే.. దీనికోసం.. ఏమైనా చేసేందుకు సిద్ధమేనని ఆయన తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూసుకుంటామని చెప్పారు. అయితే.. వాస్తవానికి ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ పార్టీకి కూడా ప్రజలు వ్యతిరేకం కాదు.. అనుకూలం అంతకన్నాకాదు. వ్యతిరేకం అయి ఉంటే.. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చేవికావు.. అనుకూలం అయి ఉంటే.. వైసీపీకి కేవలం 151 మాత్రమే దక్కేవి కూడా కావు.
ప్రజలు కోరుకునేది.. కేవలం విధానపరమైన విభేదాలు తొలగించి.. తమకు సుపరిపాలన అందించే ప్రభుత్వమే. ఇలా సుపరిపాలన అందుతుందనే ఆశలతోనే జగన్‌ను ఆనాడు గెలిపించారు. ఇప్పుడు ఓ వర్గం ప్రజలు మళ్లీ కోరుకుంటున్నది కూడా ఇదే. అంతకు మించి.. వైసీపీ లేకుండా పోవాలని కానీ..జగన్‌ను లేకుండా చేయాలని కానీ.. ప్రజల ఆకాంక్ష కానేకాదు. ఇది చాలా సున్నితమైన విషయం. దీనిని అర్ధం చేసుకుని.. ప్రజల కోరిక మేరకు.. తన విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సిన పవన్.. వైసీపీ విముక్త ఏపీ అంటే.. ఇబ్బందులు ఎదుర్కొనడమేనని అంటున్నారు.
పోనీ.. వైసీపీ విముక్త ఏపీ అంటే.. పూర్తిగా జనసేన ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందా? అంటే.. అది కూడా కష్టమే. ఎందుకంటే.. గత ఎన్నికల్లోనే 175స్థానాలకు పవన్ కేవలం 141 సీట్లలోనే తన వారిని నిలబెట్టారు. మిగిలిన వాటిని వేరేవారికి వదిలేశారు. దీనిని బట్టి పార్టీ నిర్మాణం ఎలా ఉందో తెలుస్తుంది. ఇక, ఇప్పుడు వీరు కూడా కనిపించడం లేదు. పోనీ ..వచ్చే ఎన్నికల నాటికి పార్టీనిర్మాణం పూర్తవుతుందని అనుకున్నా.. ఒక పార్టీని లేకుండా చేయడమే తన లక్ష్యమని ప్రజల మధ్యకు వెళ్తే.. ఎంత మంది పవన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారు? ఇది నియంతృత్వ పోకడ కాదా? అనేది ప్రశ్న. సో.. ఈ విధానం సరికాదనేది మేధావుల మాట.
This post was last modified on August 23, 2022 8:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…