బీహార్ అధికారంలో ఉన్న మిత్రపక్షాల్లో దాదాపు చీలిక ఖాయమైపోయింది. బీజేపీ-జేడీయూ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. కమలంపార్టీతో కటీఫ్ చెప్పాలని జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయించుకోవటంతో నరేంద్రమోడీకి పెద్ద షాకనే చెప్పాలి. అసలు ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేయాలని, బీజేపీకి గుడ్ బై చెప్పాలని నితీష్ ఎందుకు నిర్ణయించుకున్నారు ? ఎందుకంటే తానుకూడా మరో ఉధ్థద్ థాక్రే అవుతానని భయపడ్డారట. విషయం ఏమింటటే జేడీయూ ఎంఎల్ఏలతో బీజేపీ అగ్రనేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని నితీష్ కు సమాచారం అందిందట.
ఇప్పటికే మేఘాలయలో జేడీయూకి ఉన్న ఏడుగురు ఎంఎల్ఏల్లో ఆరుగురిని బీజేపీలోకి లాగేసుకున్నారు. అప్పుడే రెండుపార్టీల మధ్య అంతర్గతంగా పెద్ద గొడవైందట. ఇక ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్లను చూస్తే నితీష్ కు అసెంబ్లీ స్పీకర్ కు ఏమాత్రం పడటంలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఇతరత్రా కానీ నితీష్ చెప్పిన ఏ విషయాన్ని స్పీకర్ పట్టించుకోవటంలేదు. స్పీకర్ ను మార్చాలని నితీష్ బీజేపీ అగ్ర నేతలకు ఎంత చెప్పినా పట్టించుకోలేదట.
పైగా బీహార్లో జరగాల్సిన అభివృద్ధిని కూడా బీజేపీ ఢిల్లీ నుండే పర్యవేక్షిస్తోందట. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఏదోరోజు బీజేపీ థాక్రేని దెబ్బకొట్టినట్లే తనను కూడా దెబ్బకొడుతుందని భయపడ్డారట. వెంటనే మేల్కొనకపోతే కష్టమని డిసైడ్ అయ్యారట. అందుకనే బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు రెడీ అయిపోయారు.
ఎప్పుడైతే కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయ్యారో వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోను, ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తోను టచ్ లోకి వెళ్ళారట. వాళ్ళిద్దరు ఓకే చెప్పిన తర్వాతే మంగళవారం జేడీయూ ఎంఎల్ఏలు, ఎంపీలతో నితీష్ సమావేశం పెట్టుకున్నారు. 243 మంది ఎంఎల్ఏల అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది, బీజేపీకి 77, జేడీయూకి 43, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎంఎల్ఏలున్నారు.
This post was last modified on August 10, 2022 9:25 am
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…