వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు మాజీ ముఖ్యమంత్రుల వారసులు జోరు పెంచబోతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వారసులు దాదాపు ఎనిమిది మంది తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీయార్, నాదెండ్ల భాస్కరరావు, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు వారసులు ఎనిమిది మంది వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. వీరిలో కొందరు మొన్నటి ఎన్నికల్లో కూడా పోటీ చేసినా చతికిలపడిపోయారు.
కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, ఎంఎల్ఏ కాసు మహేష్ రెడ్డి గురజాల నుండి రెండోసారి పోటీ చేయబోతున్నారు. అలాగే కోట్ల విజయభాస్కరరెడ్డి వారసులుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా, భార్య సుజాతమ్మ ఎంఎల్ఏగా పోటీ చేయబోతున్నారు. వీరిద్దరు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్టీఆర్ కొడుకు, ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ హిందూపురం రెండోసారి పోటీచేయబోతున్నారు. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా ఎక్కడి నుండి పోటీ చేస్తారో తెలీదు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా ఓడిపోయారు.
చంద్రబాబు నాయుడు కొడుకు, మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేయటం దాదాపు ఖాయమే. ఈయన మొన్నటి ఎన్నికల్లో ఇక్కడినుండే పోటీ చేసి ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పులివెందుల నుండే పోటీచేస్తారు. నాదెండ్ల భాస్కరరావు కొడుకు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరపున తెనాలిలో పోటీచేయటం దాదాపు ఖాయమైంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.
చాలామంది తమ తాతలు, తండ్రుల వారసులుగానే రాజకీయాల్లోకి వచ్చినా నిలదొక్కుక్కున్నది మాత్రం తక్కువమందనే చెప్పాలి. జనాల్లో రెగ్యులర్ గా ఉండకపోవటం, తాతలు, తండ్రుల నుండి వచ్చిన వారసత్వాన్ని నిలుపుకోలేకపోవటం, రాజకీయాల్లో ఆసక్తి లేకపోవటమనే కారణాలతో మరికొందరు తెరమరుగైపోయారు. నీలం సంజీవరెడ్డి, దామోదర్ సంజీవయ్య, టంగుటూరి ప్రకాశంపంతులు, భవనం వెంకట్రామ్ వారసులు ఇపుడు ఎక్కడున్నారు ? ఏమిచేస్తున్నారో కూడా చాలా మందికి తెలీదు.
This post was last modified on August 8, 2022 12:34 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…