రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. ఎప్పుడైనా మారే ఛాన్స్ ఉంటుంది. దీనిని గుర్తించి.. అడుగులు ముందుకు వేయడం నాయకుల ధర్మం. అయితే.. ఇలా అడుగులు వేసినా.. ఫలితం వస్తుందా? అనేది ఒక్కొక్క సారి చెప్పడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే.. వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఎదుర్కొన బోతున్నారని.. టీడీపీ వర్గాలు అంటున్నాయి. గుడివాడ నియోజకవర్గం అంటేనే.,. నాని.. ! ఈ విషయంలో తిరుగులేదు. హవా ఎవరిది ఉన్నా.. ఇక్కడ ఆయన గెలుపు ఇప్పటి వరకు రాసి పెట్టుకో! అనేలా సాగింది.
అయితే.. పరిస్థితి ఇప్పుడు మారిపోతోంది. కొడాలికి చెక్ పెట్టేందుకు.. ఆయన దూకుడును తగ్గించేందుకు.. తమ పంతం నెగ్గించుకునేందుకు టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటు సామాజిక వర్గం పరంగానే కాకుండా.. అటు సెంటిమెంటు పరంగానూ..కొడాలికి దెబ్బేసేలా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు గుడివాడలో టీడీపీ రాజకీయాలను పరిశీలిస్తే.. కొడాలి తర్వాత.. ఆయనకు ముందు..చెప్పుకోదగ్గ నాయకుడు టీడీపీకి లేరనే అంటారు.
అందుకే.. వరుస పరాజయాలను టీడీపీ మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్‌ను ఇక్కడ ప్రయోగించింది. అయితే.. ఆ ప్రయోగం వికటించింది. పైగా.. ఆ యువ నాయకుడు.. వైసీపీలోకి జంప్ చేసేశారు. దీంతో కొడాలికి చెక్ పెట్టే నాయకుడు అంటూ.. టీడీపీలో లేకుండా పోయారనేది వాస్తవం. ప్రస్తుతం ఇంచార్జ్‌గా రావి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ.. ఆయన వల్ల కొడాలికి చెక్ పట్టే అవకాశం టీడీపీకి లేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు గేర్ మార్చారు.
కృష్ణాజిల్లాలో రాజకీయ గురువుగా ప్రసిద్ధి చెందిన చలసాని పండు కుమార్తె.. దేవినేని స్మితకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట. వాస్తవానికి చలసాని పండు..పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఆయన ఇప్పుడు లేరు. అయితే..ఆయనవారసురాలిగా స్మిత ఇప్పుడు తెరమీదికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే.. లోకేష్ సూచనల మేరకు.. ఆమె గుడివాడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.
స్మిత అయితే.. కొడాలికి చెక్ పెట్టడం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కమ్మ వర్గం.. పైగా.. మహిళా సెంటిమెంటు.. చలసాని అనుచరుల బలం.. టీడీపీ కార్డు.. ఇలా.. ఏ కోణంలో చూసుకున్నా.. స్మితకు మంచి మార్కులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సాగిన కొడాలి హవాకు.. స్మిత్ చెక్ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. పైగా కొడాలిపై.. క్యాసినో ఆరోపణలు ఉండడం.. మహిళల విషయంలోనూ.. అంత సానుకూలత లేకపోవడం వంటివి స్మితకు కలిసివస్తాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 8, 2022 10:11 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…