ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. సార్వత్రిక సమరమే వచ్చినా.. అధికారులు అత్యంత కీలకం. అధికారుల ప్రమేయం.. వారి సహకారం లేకపోతే.. ఏ పార్టీ కూడా… గెలుపు గుర్రం ఎక్కే పరిస్థితి లేదు. గతంలోనూ ఇది రుజువైంది. చంద్రబాబు తమనురాచి రంపాన పెడుతున్నారనే భావన కలగడంతో.. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో చంద్రబాబు తొలిసారి ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఇక, పొరుగున ఉన్న తమిళనాడు లోనూ.. ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసిన.. అప్పటి జయలలిత.. గెలుపు ఖాయమని.. ప్రగాఢంగా విశ్వసించినా.. పరాజయం పాలయ్యారు. గత 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగింది కూడా ఇదే. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కొందరు చక్రాలు తిప్పారనే వాదన ఇప్పటికీ.. అధికారుల మధ్య హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటిలో ఎన్నికలకు ముందు.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో తీవ్ర అలసత్వం చేశారు.
దీంతో ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఫలితంగా.. లబ్ధిదారులకు చంద్రబాబు ఇచ్చిన సంక్షేమం అందలేదు. అనేక జిల్లాల్లో వేల సంఖ్యలో ట్రై సైకిళ్లు, వాహనాలు.. తోపుడు బళ్లు.. అలానే మూలనపడ్డాయి. ఎన్నికలకు రెండు మాసాల ముందు.. వీటిని ఆయా పథకాల్లో లబ్ధిదారులకు ఇచ్చి.. ఎన్నికల సమయంలో తనకు అనకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే.. అధికారులు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ.. ఆయా కలెక్టరేట్‌లలో ఇలాంటి వాహనాలు ఉన్నాయి.
అంటే.. ఎన్నికలకు ముందు.. అధికారులు చంద్రబాబు సర్కారుకు సహకరించలేదనేది కళ్లకు కనిపిస్తున్న వాస్తవం. కట్ చేస్తే.. ఇప్పుడు.. వైసీపీ పరిస్థితి కూడా ఇంతేనా? అనేది చర్చకు వస్తోంది. గతంలో కంటే.. కూడా ఇప్పుడు అధికారులు.. ఉద్యోగులకు పనిభారం పెరిగిపోయింది. పైగా కోర్టుల నుంచి అధికారులు మొట్టికాయలు తింటున్నారు. కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
ఇక, సాధారణ ఉద్యోగులు పీఆర్సీ, సహా.. ఇతర సొమ్ముల విషయంలోపై సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఉపాధ్యాయులు.. పాఠశాల విలీనం సహా.. బదిలీలకు వ్యతిరేకంగా.. గళం విప్పుతున్నారు. అంటే.. ఎలా చూసుకున్నా.. గతంలో ఉన్న పరిస్థితే ఇప్పుడు కనిపిస్తోంది. అంతకు మించిన దుస్థితి వస్తోందని అంటున్నారు. మరి జగన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
This post was last modified on August 7, 2022 8:54 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…