Political News

ఒక‌టి క‌వ‌ర్ చేయొచ్చు.. కానీ..

వైసీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం ప్రారంభ‌మంది. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో కీల‌కమైన ఒక విష‌యాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అదే.. `రివ‌ర్స్ టెండ‌రింగ్‌` అన్ని పనుల్లోనూ రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం అనుస‌రిస్తామ‌న్నారు. అయితే.. ఇప్పుడు ఇదే కామెంట్ పార్టీ విష‌యంలోనూ వినిపిస్తుండ‌డ‌మే తీవ్రంగా నాయ‌కుల‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. “ఒక‌టి అంటే.. నెట్టుకువ‌స్తాం.. రెండంటే.. నెట్టుకొస్తాం.. కానీ, ఇన్ని విషయాల్లో రివ‌ర్స్ అయితే.. ఏం చేయాలి“ ఇదీ.. వైసీపీ నాయ‌కులు అంటున్న మాట‌.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌గ‌న్ నిర్వ‌హించిన పాదయాత్ర‌లో అనేక విష‌యాల‌పై ఆయ‌న ప్ర‌జ‌ల‌కు హామీలు ఇచ్చారు. అయితే.. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా వాటిని అమ‌లు చేయ‌డం లేదు. అంతేకాదు.. అస‌లు వాటిని అమ‌లు చేస్తారో.. లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప‌దుల సంఖ్య‌లోనే హామీల‌ను బుట్ట‌దాఖ‌లు చేశార‌ని.. వైసీపీనాయ‌కులే చెవులు కొరుక్కుంటున్నారు. వీటిలో కీల‌క‌మైనవి ఉన్నాయ‌ని అంటున్నారు.

+ ఉద్యోగుల‌కు సంబంధించిన సీపీఎస్ ర‌ద్దు ను వారంలోనే చేస్తామ‌ని చెప్పారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఇక‌పైచే సేది కూడా లేద‌ని చెప్పారు.

+ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. విడ‌త‌ల వారీగా.. మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని.. ఐదేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌య్యేనాటికి..రాష్ట్రాన్ని మ‌ద్యం ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా తీర్చిదిద్దుతామ‌న్నారు.కానీ, ఇప్పుడు మ‌ద్య నిషేధం లేక‌పోగా.. మ‌రో 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు మ‌ద్యంపై వ‌చ్చే ఆదాయాన్ని ఎర‌గా చూపి.. 8000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు.

+ అధికారంలోకి రాగానే ఆరుమాసాల్లో మెగా డీఎస్సీ అంటూ.. నిరుద్యోగుల‌ను ఊరించారు.కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఊసే లేదు. పైగా.. పాఠ‌శాల‌ల విలీనంతో.. ప్ర‌భుత్వం ద‌గ్గ‌రే చాలా మంది ఉద్యోగులు మిగిలిపోతున్నార‌ని… చెబుతున్నారు. దీనిని బ‌ట్టి.. కొత్త‌వారితో అవ‌సరం లేద‌న్న‌ట్టుగా వ్యాఖ్యానించారు. ఇది నిరుద్యోగుల‌కు అశ‌నిపాతంగా మారింది.

+ ప్ర‌త్యేక హోదాను కేంద్రం మెడ‌లు వ‌చ్చి తెస్తామ‌న్నారు. ఇది గాలికి కొట్టుకుపోయింది.

+ పింఛ‌న్లు.. రూ.250 చొప్పున వ‌ర‌సగా పెంచుతామ‌న్నారు. దీని ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.750 పెర‌గాలి. కానీ, పెరిగింది మాత్రం రూ.250. దీనిపైనా స‌ర్కారు ఉలుకు ప‌లుకు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంది.

+ పోల‌వ‌రం పూర్తి చేసి.. 2021 చివ‌రి నాటికి ఇస్తామ‌న్నారు. 2022 కూడా పూర్త‌వుతోంది. కానీ, ఇప్ప‌టి వ‌రకు ఈ ఊసు లేదు. అస‌లు ఎప్పుడు పూర్త‌వుతుందో.. తెలియ‌ద‌ని ప‌రోక్షంగా జ‌గ‌నే చెప్పారు. ఇలా.. ఒక‌టి కాదు.. అనేక విష‌యాల్లో.. జ‌గ‌న్ తీసుకున్న రివ‌ర్స్ గేర్ ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి ఆయా విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు రేపు ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.

This post was last modified on August 7, 2022 6:42 am

Share

Recent Posts

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

30 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

38 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

50 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

54 minutes ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

2 hours ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

3 hours ago