కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పదే పదే లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటే. అదేమిటంటే ఓటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను ఎలా పనిచేయగలనని. రేవంత్ ను ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా రాజగోపాల్ ఇదే ప్రశ్నను పదే పదే బహిరంగంగానే లేవనెత్తుతున్నారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు క్రాస్ ఓటింగ్ కోసం రూ. 50 లక్షలిస్తు ఏసీబీకి దొరికిన విషయం వాస్తవం.
ఈ కేసులోనే రేవంత్ 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చారు. ఇంకా కేసు కొనసాగుతునే ఉంది. రేవంత్ ను అవమానించాలన్న ఏకైక టార్గెట్ తోనే ఆయన ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇదే విషయాన్ని చుండూరులో జరిగిన బహిరంగ సభలో రేవంత్ ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో తాను 30 రోజులు జైలుకు వెళ్ళి వచ్చింది వాస్తవమే అని అంగీకరించారు. తాను 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని చెబుతూనే అమిత్ షా 90 రోజులు జైలుకెళ్ళొచ్చిన మాట అబద్ధమా అని ప్రశ్నించారు.
తాను ఓటుకు నోటు కేసులో జైలు కెళితే అమిత్ షా మర్డర్ కేసులో 90 రోజులు జైలులో ఉండొచ్చారని గుర్తుచేశారు. తన నాయకత్వంలో పనిచేయటానికి ఇష్టపడిన రాజగోపాల్ మరి 90 రోజులు జైలులో ఉండొచ్చిన అమిత్ షా నాయకత్వంలో ఎలా పనిచేస్తారంటు నిలదీశారు. ఢిల్లీలో అమిత్ షా పెట్టిన గడ్డి రాజగోపాల్ కు తియ్యగా ఉందా అని రాజగోపాల్ ను రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
మరి రేవంత్ అడిగిన ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం చెప్పగలరా ? రేవంతన్నా ఓటుకునోటు కేసులో 30 రోజులు జైలుకెళ్ళింది వాస్తవమే అని అంగీకరించారు. మరి ఇదే పద్దతిలో అమిత్ షా కూడా అంగీకరిస్తారా ? రేవంత్ జైలుకు వెళ్ళి రావటమే రాజగోపాల్ అభ్యంతరమైతే అమిత్ షా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్నది వాస్తవమే కదా ? మరి రాజగోపాల్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.
This post was last modified on August 6, 2022 9:17 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…