ఒకరు తర్వాత.. ఒకరు. ఒకరిని మించి మరొకరు.. అన్నట్టుగా వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. దీంతో అటు.. పార్టీకి ఇటు ప్రభుత్వానికి, మరోవైపు.. పార్టీ అధినేత జగన్‌కు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. అంతేకాదు.. పార్టీ నేతలు చేస్తున్న తప్పులకు.. అంటున్న కామెంట్లకు.. జగన్ సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.. అప్పులు చేస్తున్నారంటూ.. విపక్షాలు వాయించేస్తున్నాయి. దీని నుంచే సమాధానం చెప్పలేక ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు.. ఏకంగా.. నాయకులు.. తెస్తున్న కొత్త తిప్పలు మరింతగా సర్కారుకు ప్రాణసంకటంగా మారాయి.
గతంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అరగంట చాలని.. ప్రస్తుత మంత్రి.. అంబటి రాంబాబు.. గంట కావాలని.. చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ లైవ్‌లోనే ఉన్నాయి. అంతేకాదు.. వారిద్దరిపైనా.. ఇప్పటి వరకు సర్కా రు చర్యలు తీసుకోలేదనే అపప్రద ఉండనే ఉంది. ఇక, ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా.. తన అనుచరు డిని చంపేసి డోర్ డెలివరీ చేశాడని.. ప్రతిపక్షాలు ఇప్పటికీ నిప్పులు చెరుగుతున్నాయి.
మరోవైపు.. రాష్ట్రంలో ఎస్సీ మహిళలకు రక్షణలేదనే టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఎంపీ గోరంట్ల మాధవ్ ఉదంతం.. మరింత కాక రేపుతోంది. తన వీడియో ను మార్ఫింగ్ చేశారని.. ఆయన చెబుతున్నా.. ఇది నమ్మశక్యంగా లేదని.. స్పష్టంగా తెలుస్తున్నట్టు వైసీపీలోనే ఓ వర్గం నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇక దీనిపై మహిళా సంఘాలు.. ఇతర పార్టీల నాయకులు ఫైరవుతున్నారు.
ఈ నేపథ్యంలో అటు తిరిగి… ఇప్పుడు సీఎం జగన్‌ను ఉచ్చులోకి లాగినట్టు అయింది. తక్షణమే ఎంపీ గోరంట్లతో రాజీనామా చేయించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అదేసమయంలో మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. కూడా మహిళా సంఘాల నాయకులు డిమాండ్లు చేస్తున్నారు. ఇంకోవైపు.. పార్టీ నాయకులు ఎవరూ కూడా ఈ ఘటనను ఖండించలేదు. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్లు కూడా.. ఎవరికి వారుమౌనంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ ఘటనను నిజమేనని నమ్మాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో జగన్ చుట్టూ.. మరో వివాదం చుట్టుముట్టిందని అంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 5, 2022 4:49 pm
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…