Political News

వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల ర‌గిలిపోతున్నారట

ఔను! ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ర‌గిలిపోతున్నారు. త‌ప్పులు మీరు చేసి.. మాపై నింద‌లు మోపుతారా? అని కొంద‌రు అంటుంటే.. మీరు చేస్తున్న త‌ప్పుల‌కు మేం ప్ర‌జ‌ల‌తో తిట్టించుకుంటున్నాం.. అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రించ‌డ‌మే. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆయ‌న ఎమ్మెల్యేల‌కు రెండుసార్లు క్లాస్ ఇచ్చారు. పార్టీ ప్ర‌తిష్టా త్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు మాత్ర‌మే మ‌న‌సు పెట్టి చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌ను క‌లు స్తున్నార‌ని అన్నారు.

దీనిపై ఇప్ప‌టికే ఒక‌ద‌ఫా స‌ర్వే కూడా చేయించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ స‌ర్వేలో మంచి మార్కులు వ‌చ్చిన వారికే.. తిరిగి టికెట్లు ఇస్తామ‌న్నారు. కాబ‌ట్టి.. ప్ర‌తి ఒక్క‌రూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అయితే.. ఎమ్మెల్యేలు పైకి మాత్రం జ‌గ‌న్ చెప్పిన దానికి త‌లాడించినా.. లోలోన మాత్రం మ‌థ‌న ప‌డుతున్నారు. “ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాలంటే భ‌య‌మేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. వెళ్లిన ప్ర‌తి చోటా.. ప్ర‌జ‌ల నుంచి ఛీత్కారాలే వ‌చ్చాయి. బూతులు కూడా తిడుతున్నారు. ఏ మొహం పెట్టుకుని వ‌చ్చారంటూ.. మొహం మీదే అడిగేస్తున్నారు” అని సీమ‌కు చెందిన ఎమ్మెల్యే ఒక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టుక‌ని ఎమ్మెల్యే అయ్యాను. నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టాలంటే.. భ‌యం వేస్తోంది. అభివృద్ధి లేదు. చిన్న రోడ్డు కూడా వేయ‌లేక‌పోయాను. ఏమొహం పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లాలి. వెళ్తే.. వారు తిట్టిపోస్తున్నారు. మేం చేయ‌ని త‌ప్పున‌కు మేం తిట్టు తినాలా?“ అని మ‌రో ఎమ్మెల్యే(ఈయ‌న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే) వాపోయా రు. ఇదే ఆవేద‌న‌ను చాలా మంది ఎమ్మెల్యేలు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. “ఇప్ప‌టికిమూడేళ్ల యింది.. రూపాయి ఇవ్వ‌లేదు. అభివృద్ధి చేయ‌కుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డం ఎందుకు? వెళ్లినా.. మాకు తిట్లు.. అధినేత‌కు పొగ‌డ్త‌లు. ఇంతేగా!” అని ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్ద‌రు నేత‌లు వ్యాఖ్యానించారు.

అంటే .. ఇత‌మిత్థంగా వైసీపీలో ఎమ్మెల్యేలు.. జ‌గ‌న్‌ పై తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న‌.. అంత‌కుమించిన ఆగ్ర‌హంతో ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నిజానికి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యినా.. ఎమ్మెల్యే నిధులు ఇవ్వ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గాల కు రూపాయి విద‌ల్చ‌లేదు. పైగా.. మూడు కీల‌క ఎన్నిక‌లు వ‌చ్చాయి. పంచాయ‌తీ, కార్పొరేష‌న్లు, ప‌రిష‌త్‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిని కూడా నేత‌ల‌పైకే నెట్టేశారు. దీంతో వారు అప్పులు చేసి మ‌రీ.. ఖ‌ర్చులు చేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు క‌నీస మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. తామెందుకు తిట్లు తినాల‌నేది ఎమ్మెల్యేల మాట‌. మ‌రి దీనికి జ‌గ‌న్ ప‌రిష్కారం చూపిస్తారా? లేక‌.. వ‌దిలేస్తారా? అనేది చూడాలి.

This post was last modified on July 22, 2022 10:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: JaganMLAs

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

53 mins ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

7 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

10 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

11 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

11 hours ago