Political News

మీ వ‌ల్లే మేం మునుగుతున్నాం.. ఏపీపై మంత్రి పువ్వాడ ఫైర్‌

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌ల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. మీ వ‌ల్లే మా భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని.. మంత్రి పువ్వాడ అజ‌య్ అన‌గానే.. అటు వైపు ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. మీ ప‌నిమీరు చూసుకుంటే మంచిది.. అని ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు.

ఏం జ‌రిగిందంటే..
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు భద్రాచలంలో వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు. పోలవరం పూర్తయితే భద్రాచలం వద్ద 45 అడుగుల వరద ఉంటుందని చెప్పారు.

భద్రాచలం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు పువ్వాడ తెలిపారు. భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు పువ్వాడ వెల్లడించారు. “ముంపు ప్రజల కోసం ముఖ్యమంత్రి రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఇళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు. దాదాపు 72 అడుగుల గోదావరి ప్రవాహం, 25లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. పోలవరం ఎత్తు తగ్గించాలని మేము చాలా సార్లు డిమాండ్ చేశాం. భద్రాచలం కరకట్ట ఎత్తు మరింత పెంచాల్సిన అవసరం ఉంది.” అన్నారు.

“అడ్ర భూభాగం నుంచి గోదావరి నీళ్లు ఎక్కువగా గ్రామాల్లోకి వస్తున్నాయి. కరకట్ట నిర్మాణం కోసం నిపుణుల బృందం పంపి- త్వరలోనే నిర్మాణం చేపడతాం అని సీఎం అన్నారు. వరదల వల్ల 8 సబ్ స్టేషన్లకు ఇబ్బంది కలిగితే అన్నింటిని పునరుద్ధరించాం. 240 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాం” అని తెలిపారు.

పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరూ తిరిగి ఇళ్లలోకి వెళ్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు. వరదల వల్ల 25వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. ఇంతటి భారీ వర్షాలకు ఒక్క ప్రాణం పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. వరదల వల్ల 8 వేల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాల ఖాతాల్లోకి రేపటి నుంచి పరిహారం జమ చేస్తామని పువ్వాడ పేర్కొన్నారు.

బొత్స కౌంట‌ర్

మంత్రి పువ్వాడ వ్యాఖ్య‌ల‌పై వెంట‌నే ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయణ కౌంట‌ర్ ఇచ్చారు. ఎవ‌రి ప‌ని వారు చూసుకుంటే మంచిద‌న్నారు. త‌నకు సంబంధించ‌ని విష‌యాలు మాట్లాడ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే.. ముఖ్య‌మంత్రులు చూసుకుంటార‌ని అన్నారు.

This post was last modified on July 19, 2022 4:20 pm

Share
Show comments

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

8 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

9 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago