ఔను.. టీడీపీకి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలను తిరిగి దక్కించుకుంటామా? అసలు ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ ఎలా పుంజుకుంది? ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం.. ఇలా పలు జిల్లాల్లో వైసీపీ ఎలా దూకుడు ప్రదర్శించింది? అనేది టీడీపీ నేతల మధ్య మరోసారి ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇలా ఎందుకు జరిగిందనేది ప్రధాన ప్రశ్న. దీనిపై మరోసారి టీడీపీ నేతలు కసరత్తు ప్రారంభించారు.
పార్టీ పుట్టినప్పటి నుంచి విజయం దక్కించుకుంటున్న నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఉదాహరణకు తాడిపత్రి, విజయవాడ సెంట్రల్, కొవ్వూరు(పశ్చిమ గోదావరి), ఏలూరు, దెందులూరు, పెనమలూరు, గురజాల, వినుకొండ. ఇలా అనేక నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. పైగా వీరిపై ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. ప్రజలకు చేరువైన నాయకులు.. ప్రజల కోసం పనిచేసే నాయకులే ఉన్నారు. అయితే.. వీరంతా ఓడిపోయారు.
ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబు సైతం కాలికి చెప్పులు అరిగిపోయేలా తిరిగి ప్రచారం చేశారు. అయినా కూడా వీరు ఓడిపోయారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అయితే.. పార్టీ ఎందుకు ఇక్కడ ఓడిపోయింది? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొన్నాళ్ల కిందట పార్టీ ఇంచార్జ్‌లతో తెప్పించుకున్న నివేదికల్లో కూడా ‘అంతా బాగానే ఉంది’ అనే రిపోర్టు వచ్చింది. మరి ఎలా వీరంతా ఓడిపోయారు? అనేది ఆసక్తిగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? ఆయా నియోజకవర్గాలను ఎలా దక్కించుకోవాలి? అనే విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిత్యం ప్రజల్లో ఉండాలని.. గత ఎన్నికల్లో ఎంతెంత ఓటింగ్ తగ్గిందో లెక్కలు వేసుకోవాలని.. మండలాల వారీగా.. ప్రజలను కలుసుకుని.. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకోవాలని.. కంచుకోటలను పదిలం చేసుకోవాలని.. ఆయన సూచించినట్టు సమాచారం. అదేసమయంలో పటిష్టమైన నియోజకవర్గాల్లో తమ్ముళ్లు కలిసి కట్టుగా ఉండాలని.. ఎక్కడా తేడా రాకుండా వ్యవహరించాలని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. మరి తమ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 19, 2022 10:54 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…