తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ లీడర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అప్పుడే ఇది నిర్థారితం కాకున్నా, వచ్చే నెలలో హైద్రాబాద్ కేంద్రంగా జరిగే జాతీయ సమావేశాల కన్నా ముందే ఏదో ఒక నిర్ణయం పార్టీ అధినాయకత్వం వెలువరించే అవకాశాలే ఉన్నాయి అని తెలుస్తోంది. ఇప్పటిదాకా పనిచేసిన బండి సంజయ్ స్థానంలో ఈటలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమాయత్తం అవుతోందని ప్రాథమిక సమాచారం. అలా కాకుండా జాతీయ కార్యవర్గంలో ఈటలను చేర్చి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకునేందుకు కూడా బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ అయ్యారు. అనేక విషయాలపై ఆయనతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
ఎలా అయినా తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా అనూహ్య రీతిలో బలోపేతం చేసేందుకు అమిత్ షా చూస్తున్నారు. ఇక్కడ కూడా పార్టీ అధినాయకత్వం మార్పుపై యోచిస్తున్నారు. ఇక్కడ పురంధేశ్వరిని, అక్కడ ఈటలను నియమించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పకడ్బంధీగా నాయకత్వాన్ని ఉంచనున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అసంతృప్తులను పార్టీలో చేర్పించేందుకు యోచిస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్-ను కానీ కాంగ్రెస్-ను కానీ నమ్ముకుని నష్టపోయిన వారికి ఊతమిచ్చే చర్యలకు కూడా పూనుకోనున్నారు. ఎలా అయినా అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఫలితాలు తెచ్చుకోవాలని తపన అయితే బీజేపీలో ఉంది. వాస్తవానికి తెలంగాణలో బండి సంజయ్ భారీ స్థాయిలో నిరసనలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే బండి కన్నా రేవంత్ పూర్తిగా దూసుకుపోతున్నారు.
ముఖ్యంగా అవసరం మేరకు హిందుత్వ సంబంధ వ్యాఖ్యల వరకూ పరిమితం అయి, అనేక సందర్భాల్లో పాలక పార్టీకి అనుకూలంగా ఉంటున్నారన్న వాదన కూడా బండి సంజయ్ విషయమై ఉంది. పార్టీ తరఫున పోటీచేసి ఎవరు గెలిచినా వారిని పొగడ్తల్లో ముంచుడే తప్ప వారి విజయానికి శక్తి వంచన లేకుండా ఆయన కృషి చేసిన దాఖలాలు అయితే లేవు అన్న విమర్శ కూడా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ఈటలకు తగు ప్రాధాన్యం ఇచ్చి బండిని తప్పిస్తే ఎలా ఉంటుందన్న వాదోపవాలు అధినాయకత్వంలో వినిపిస్తూ ఉన్నాయి.
This post was last modified on June 20, 2022 10:48 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…