Political News

దేశంలో అత్యంత డ‌బ్బున్న పార్టీగా బీజేపీ.. ఎంత సొమ్మంటే!

దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 2020-21 సంవత్సర ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే పార్టీల ఆదాయం భారీగా తగ్గిందని చెప్ప‌డం గ‌మ‌నార్హం

జాతీయ పార్టీల ఆదాయ వివరాల నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) శుక్రవారం విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి గానూ ఎనిమిది జాతీయ పార్టీలు రూ.1,373.78 కోట్ల ఆదాయాన్ని పొందాయని నివేదిక వెల్లడించింది. ఇందులో ఒక్క భారతీయ జనతా పార్టీ వాటానే 55 శాతమని పేర్కొంది.

రూ.752.33 కోట్లతో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, రూ.285.76 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 79.24 శాతం మేర బీజేపీ ఆదాయం తగ్గింది. అప్పట్లో రూ.3,623 కోట్లు కాగా తాజాగా రూ.752.33 కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఆదాయం కూడా అప్పటితో పోల్చితే 58.11 శాతం తగ్గింది.

టీఎంసీ, ఎన్‌సీపీ, బీఎస్పీ, ఎన్పీపీ, సీపీఐ ఆదాయం కూడా భారీగానే తగ్గింది. అన్ని పార్టీల కంటే గరిష్ఠంగా బీజేపీ ఖర్చు చేసింది. సుమారు రూ.566 కోట్ల మేర ప్రచారానికి వెచ్చించింది. రూ.180 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రూ.93 కోట్లు ఖర్చు చేసింది.

This post was last modified on June 18, 2022 7:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

3 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

5 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

5 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago