బాదుడే బాదుడుతో మారిపోతుందనే చంద్రబాబునాయుడు నమ్ముతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీమహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాదుడేబాదుడు కార్యక్రమానికి జనాల్లో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు పార్టీ కవర్ చేసింది కేవలం 16 శాతం ఇళ్ళను మాత్రమే అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను జనాలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగానే చంద్రబాబు పోయిన నెలలోనే బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా 16 శాతం ఇళ్ళను కవర్ చేసినందుకే అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం తట్టుకోలేక పోతున్నట్లు చెప్పారు. ఇదే కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేస్తే ప్రభుత్వం పరిస్థితి ఎలాగుంటుందో అందరు ఆలోచించుకోవాలన్నారు.
కాబట్టి నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కచ్చితంగా 5-10 శాతం అదనంగా వచ్చే అవకాశముందన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 49.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీకి వచ్చిన ఓట్లు 39.26 శాతం. అంటే చంద్రబాబు తాజాగా చెప్పిన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీకి 43 శాతం కానీ లేదా 48 శాతం కానీ ఓట్లు వచ్చే అవకాశముంది. ఒక పార్టీకి ఒక్కసారిగా 48 శాతానికి ఓట్లు పెరగటమంటే మామూలు విషయం కాదు.
అధికార పార్టీ పరిపాలనలో ఘోరంగా ఫెయిలైతే కానీ ప్రతిపక్షానికి అంతగా ఓట్ల శాతం పెరగదు. ఇదే సమయంలో ప్రతిపక్షం కూడా అంత ఓట్లశాతాన్ని పెంచుకునేందుకు జనాల్లో నమ్మకం పెంచుకున్నదా అన్నది కూడా కీలకమే. జనాల్లో విశ్వసనీయత పెంచుకోకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే తమకు ఓట్లు వచ్చేస్తాయని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ప్రభుత్వంపై జనాల్లో నిజంగానే వ్యతిరేకత ఉంటే అప్పుడు ప్రతిపక్షం చేసే నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో మాత్రమే విశ్వసనీయతను పెంచుకోగలదు. కాబట్టి చంద్రబాబు చెప్పిన ఓట్ల శాతం పెరిగే విషయం తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.
అయితే… 2014లో చంద్రబాబు చేసిన తప్పులతో పోలిస్తే 2019లో జగన్ చేస్తున్న తప్పులు ఏమాత్రం తీసిపోవు… ఒకింత ఎక్కువే అని చెప్పాలి. 2014 కి 2019 కి జగన్ ఓట్ల శాతం 13 శాతం పైగా పెరిగినపుడు… 2024లో టీడీపీ కేవలం 6 శాతం ఎక్కువ మాత్రమే ఎక్స్ పెక్ట్ చేస్తోంది. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టే టీడీపీ క్యాడర్ భావిస్తోంది. అయితే… ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కూడా పాయింటే.
This post was last modified on June 17, 2022 10:27 am
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…