ఖమ్మం మాజీ ఎంపీ.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి.. ఉగ్రరూపం చూపించారు.. పోలీసులపైనే ఉగ్రతాండవం చేశారు. స్టేషన్‌కు వచ్చి కొడతా.. అంటూ.. ఓ ఎస్సై కాలర్ పట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు.. రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది.
రాజ్భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆమె.. పోలీస్ కాలర్ను పట్టుకుని.. ‘నన్నే పట్టుకుంటావా.. స్టేషన్కు వచ్చి మరీ కొడతా’ అంటూ రేణుకా చౌదరి పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాదు.. మహిళా పోలీసులను కూడా నెట్టేశారు.
రాహుల్ గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ముఖ్యంగా పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతల అరెస్టుకు యత్నించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. తనను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. తనను చుట్టుముట్టిన పోలీసులతో గొడవ పడ్డారు.
పోలీసు కాలర్ పట్టుకుని లాగారు రేణుకా చౌదరి. ‘నన్నే పట్టుకుంటావా.. స్టేషన్కు వచ్చి మరీ కొడతా’ అంటూ పోలీసు అధికారిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ‘నాపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తా’ అని హెచ్చరించారు. అనంతరం రేణుకా చౌదరిని పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on June 16, 2022 5:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…