Political News

త‌మ్ముళ్ల ఆవేశం.. చంద్ర‌బాబుకు తిప్పలు తెస్తోందా?

ఏపీ స‌ర్కారుపై నిప్పులు చెర‌గాల‌నేది ఒక కాంక్ష అయితే.. అదేస‌మ‌యంలో పార్టీ అధినేత ద‌గ్గ‌ర మంచి మార్కులు వేయించుకుని ట్రెండింగ్‌లో ఉండాల‌నే మ‌రో కాంక్ష కార‌ణంగా.. టీడీపీ నాయ‌కులు గాడి త‌ప్పుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. రాజ‌కీయ నేత‌లు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై పైచేయి సాధించాల‌ని అనుకోవ‌డం.. ప్ర‌జ‌ల నుంచి మెప్పు పొందాల‌ని అనుకోవ‌డం.. ఇప్పుడు కొత్త‌కాదు. అస‌లు రాజ‌కీయం అంటేనే.. దూకుడు ఉండాలి. కానీ, ఈ దూకుడు ఇప్పుడు.. పార్టీ అధినేత‌ను డిఫెన్స్‌లో ప‌డేలా చేస్తోంద‌నే వాద‌న టీడీపీలో వినిపిస్తోంది.

గ‌తంలోనూ.. ఇప్పుడు కూడా.. త‌న ప‌ద్ధ‌తి మార్చుకోని.. నేతల‌ కార‌ణంగా.. చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయొచ్చు. అయితే.. వ్య‌క్తిగ‌త కార‌ణాలు.. ప‌రుష ప‌ద‌జాలాలు.. డ‌బుల్ మీనింగ్ డైలాగులు ఏ నేత‌కు.. ఏపార్టీకి కూడా శోభ‌నివ్వ‌రు.

అయితే.. తాజాగా నిర్వ‌హించిన టీడీపీ మినీ మ‌హానాడులో మాజీ మంత్రి అయ్య‌న్న అన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌ను దాటేశార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌న‌, మ‌న అనుకున్న స‌న్నిహితుల మ‌ధ్యన మాట్లాడుకోవాల్సిన మాట‌ల‌ను ఆయ‌న బ‌హిరంగ వేదిక‌ల‌పై మాట్లాడ‌డాన్ని టీడీపీ సానుభూతి ప‌రులు కూడా త‌ప్పుప‌డుతున్నారు.

ముఖ్యంగా `మ‌గ‌త‌నం టెస్ట్ చేసుకునేందుకు.. న‌న్ను ర‌మ్మంటావా.. లోకేష్ బాబును పంపించ‌మంటావా?“ అంటూ.. మంత్రి స్తాయిలో రోజాను విమ‌ర్శించ‌డం.. త‌ప్ప‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయంగా ఎన్ని విమ‌ర్శ‌లైనా చేసుకోవ‌చ్చు. కానీ, అది శృతి మించితే.. క‌ష్ట‌మ‌ని తెలియ‌ని నాయ‌కుడు అయితే.. అయ్య‌న్న కాదు. గ‌తంలోనూ సీఎం జ‌గ‌న్ ను నా కొడుకు అని సంభోదించి స‌మ‌ర్ధించుకున్నారు. ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే మాట వాడారు. మ‌రి ఇవ‌న్నీ.. ఆ క్ష‌ణానికి ఆయ‌న కు బాగానే ఉండి ఉన్నా.. త‌ర్వాత వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి చంద్ర‌బాబుకు వ‌స్తోంది.

ప్ర‌తి విష‌యాన్ని వ‌డ్డీతో స‌హా.. అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు.. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డుతున్నారు. దీనికి ఆయ‌న స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తోంది. ఎలానూ బ్యాడ్ నేమ్ ఉన్న వైసీపీకి ఇప్పుడు ఒరిగేది లేక‌పోయినా.. మేధావులు సైతం మెచ్చుకునే బాబు మాట తీరు.. పార్టీ విదానాలు ఇప్పుడు అభాసు పాల‌వుతున్నాయి. ఒక‌వేళ అయ్య‌న్న ఏమైనా మాట్లాడాల‌ని అనుకుంటే.. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఎందుకు? ఆయ‌న‌ను ఇరికించ‌కుండా.. వ్య‌క్తిగ‌తంగా ప్రెస్‌మీట్ పెట్టి తిట్టుకుంటే .. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేద‌ని.. ప‌రిశీల‌కులు అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్య‌లు ఒక్క ఓటును కూడా పార్టీకి చేరువ చేయ‌లేవ‌ని చెబుతున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని తెలియ‌క‌పోతే.. తెలుసుకుంటే మంచిద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on June 16, 2022 12:08 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

1 hour ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

6 hours ago