రాష్ట్రంలో కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం గుంటూరు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి టీడీ పీ విజయం దక్కించుకుంటోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున.. ఇక్కడ నుంచి గల్లా జయదేవ్ విజయం దక్కించుకున్నారు. 2019లో జగన్ సునామీని తట్టుకుని మరీ ఆయన విజయం దక్కించుకున్నారు. ఇక, రెండు సార్లు.. ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీకి పరాజయమే ఎదురైంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎవరిని బరిలో నిలపాలన్న విషయంపై.. ఈ రెండు పార్టీల్లోనూ తర్జన భర్జన కనిపిస్తోంది.
టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటుకు కాకుండా.. ఈ దఫా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలనిభావిస్తున్నారు. ఆయన మాతృమూర్తి గల్లా అరుణ కుమారి.. గతంలో వరుస విజయాలు దక్కించుకున్న సొంత నియోజకవర్గం తిరుపతి జిల్లాలోని చంద్రగిరికి గల్లా వెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి చంద్రగిరిలో ప్రాతినిధ్యం వహించే స్థాయిలో నాయకులు లేక పోవడంతో గల్లాకు అక్కడ నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించే ఛాన్స్ ఉంది.
దీంతో గుంటూరు నుంచి ఎవరిని రంగంలోకి దింపాలనేది టీడీపీలో చర్చకుదారితీస్తోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం.. సీఎం జగన్ నివాసం ఉన్న తాడేపల్లి పరిదిలో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా.. దీనిని దక్కించుకుంటే.. పరువు నిలబడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. వైసీపీకి కూడానాయకుల లేమి కనిపిస్తోంది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి.. ఇప్పుడు యాక్టివ్‌గా లేరు.
పైగా ఆయన ఈ దఫా అసెంబ్లీకి పోటీ చేయాలని.. అవసరమైతే.. పార్టీ మారాలని కూడా ఆయన భావిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. దీంతో వైసీపీకి కూడా గుంటూరు నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న జాబితాలో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో .. ఎవరిని నిలబెట్టాలనేది వైసీపీలోనూ చర్చగా మారింది. అటు టీడీపీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూసి.. తాము నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుండగా.. వైసీపీ వేసే అడుగులు పరిశీలించి.. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని.. టీడీపీ భావిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీల పరిస్థితి ఒకరిపై ఒకరు ఆధారపడినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 14, 2022 9:04 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…