సాధారణంగా.. ధర్నాలు.. ర్యాలీలపై ఇటీవల కాలంలో ఉక్కుపాదం మోపుతున్న కేసీఆర్ సర్కారు.. ఆయా నేతలను గృహ నిర్బంధాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేయాలన్నా.. ఉద్యమాలు సాగించాలన్నా.. పోలీసుల నుంచి కేసులు.. నోటీసులు , గృహనిర్బంధాలు ఎదురవుతున్నాయి. అయితే..చిత్రంగా ఇప్పడు.. కాంగ్రెస్ చేస్తున్న ధర్నా, ర్యాలీలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీనికి కారణం.. కాంగ్రెస్ చేపట్టిన ఈ ధర్నా, ర్యాలీలు.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉండడమే.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ర్యాలీ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీ ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్డు నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు సాగనున్న ఈ ర్యాలీకి.. పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చారు. ముందు జాగ్రత్తగా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున మోహరించారు.
మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ కూడలి, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్బాగ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కూడలి, అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని, నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించి అక్కడ నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. వీరికి పోలీసులు సహకరించడం.. ప్రబుత్వం కూడా అనుమతులు ఇవ్వడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
This post was last modified on June 13, 2022 3:20 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…