ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో పోలీసులు కట్టుకథ అల్లారా? పోస్టుమార్టం నివేదిక.. ఔననే అంటోంది. డ్రైవర్ సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మించేందుకు.. మృతదేహాన్నిఎమ్మెల్సీ కొట్టారని పోలీసులు చెప్పగా.. మరణానికి ముందే గాయాలయ్యాయని పోస్టు మార్టం నివేదిక నిగ్గుతేల్చింది.
ఏపీలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును కాపాడేందుకు.. కేసు తీవ్రతను తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని పోలీసులు మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పు డు సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక.. ఖాకీల కట్టుకథను మరోసారి తెరపైకి తెచ్చింది. పోస్టుమార్టం నివేదికకు, పోలీసుల ప్రకటనకు పొంతన కుదరడం లేదు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు సందర్భంగా కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియా ముఖంగా చెప్పిన వివరాలివి.. అనంతబాబు నెట్టడంతో సుబ్రమణ్యం అపార్ట్‌మెంట్ డ్రైనేజ్‌పై పడి తలకు గాయమైందని, కారులో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే చనిపోయాడని ఎస్పీ ఆనాడు తెలిపారు. అయితే హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అనంతబాబు.. సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి చెట్టుకొమ్మ తో తొడలు, చేతులు, భుజం, వీపుపై కొట్టారని వెల్లడించారు.
కానీ, సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మృతుడి శరీరంపైన, లోపల 34 గాయాలున్నాయని మృతదేహం కళ్లు, నోరు కొద్దిగా తెరిచి ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. శరీరంలో అంతర్గత రక్తస్రావమైందని, ఊపిరితిత్తులు కొంతమేర సాగాయని.. రంగరాయ వైద్యకళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్నాలజీ ప్రధానాచార్యునితోపాటు, సహ ఆచార్యుడు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో స్పష్టం చేశారు. మరణానికి ముందే మృతదేహంపై గాయాలున్నట్లు.. పేర్కొన్నారు.
ఇవన్నీ బలమైన, మొద్దుబారిన వస్తువుతో బతికుండగానే కొట్టినవని పొందుపరిచారు. నిజానికి కొట్టిన గాయాల వల్లే సుబ్రమణ్యం చనిపోయాడని పోలీసులు మే 21న శవపంచనామా సమయంలోనే గుర్తించా రు. తల, వీపు, కాళ్లు, చేతుల మీద బలంగా కొట్టడం వల్ల తగిలిన గాయాలకే చనిపోయినట్లు పైకి కనిపి స్తోందని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహంపై 15 గాయాలున్నట్లు పంచనామా నివేదికలో పేర్కొన్నారు.
వీటితోపాటు ఇతర గాయాలనూ మరింత లోతుగా వైద్యనిపుణులు పరీక్షించి ఎన్ని సెంటీమీటర్ల లోతున తగిలాయో కొలతలతో సహా పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు మృతుడి శరీరంలో అవయవాలను చిన్నచిన్న ముక్కలుగా సేకరించి విజయవాడలోని ఆర్ఎఫ్ఎస్ఎల్‌తో పాటు రంగరాయ వైద్య కళాశాలలోని పాథాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో మరింత స్పష్టత రానుండగా నివేదికలు అధికారికంగా అందడానికి మరో 2 నెలలు పడుతుందని భావిస్తున్నారు.
This post was last modified on June 12, 2022 6:14 pm
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…