Political News

త‌మిళ‌నాడును కుదిపేస్తున్న లాక‌ప్ డెత్స్

justiceforjeyarajandfenix.. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇద్ద‌రు అమాయ‌కుల‌ను పోలీసులు తీవ్రంగా హింసించి వారి మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఉదంతం త‌మిళ‌నాడును కుదిపేస్తోందిప్పుడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ అదే స్థాయిలో త‌మిళ‌నాట ఉద్య‌మానికి దారి తీసేలా ఉందీ ఉదంతం. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తూ.. రాజ‌కీయంగా కూడా దుమారానికి కార‌ణ‌మ‌య్యేలా క‌నిపిస్తున్న ఈ ఉదంతం పూర్తి వివ‌రాలు చూద్దాం.

తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని శాతంకులం ప్రాంతంలో కూడా లాక్ డౌన్ పెట్టారు. ఐతే వారం రోజుల కింద‌ట జయరాజ్ (59) అతని కుమారుడు ఫెనిక్స్ (31) త‌మ‌ మొబైల్ దుకాణాన్ని గ‌డువు త‌ర్వాత ఐదు నిమిషాల‌కు కూడా మూయ‌లేదు. ఇది గమనించిన శాతంకులం పోలీసులు జయరాజ్, ఫీనిక్స్‌ల‌తో దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రించారు. వాళ్లిద్ద‌రూ దీటుగా బ‌దులిచ్చారు. వాగ్వాదం జ‌ర‌గ‌డంతో ఇద్ద‌రినీ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అక్క‌డ వారిని బ‌ట్ట‌లు విప్పి రెండు మూడు రోజుల పాటు విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్ట‌డంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నార‌. వారి మోకాళ్లు ప‌చ్చ‌డ‌య్యాయి. మ‌ర్మాంగాలు దెబ్బ తిన్నాయి. ప‌రిస్థితి విష‌మించాక వారిని దగ్గరలోని కోవిల్ పట్టి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 22 న కొడుకు ఫీనిక్స్ ప్రాణాలు విడిచాడు, తండ్రి జయరాజ్ పరిస్థితి కూడా క్షీణించి త‌ర్వాతి రోజు ఆయన కూడా మృతిచెందాడు. కేవలం 24 గంటల పరిదిలో రెండు ప్రాణాలను కోల్పోయిన కుటుంబం తీవ‌క‌న విషాదంలొ మునిగిపోయింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. రాజ‌కీయంగా పెను దుమారానికి కార‌ణ‌మైంది. ఈ కేసులో ఇద్ద‌రు ఎస్సైలు, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను స‌స్పెండ్ చేశారు.

This post was last modified on June 26, 2020 7:42 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

11 hours ago