తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటే సీనియర్లు అంటే వృద్ధతరం తప్పుకోవాలన్నారు. వృద్ధతరం తప్పుకోకపోతే ఇక యువతకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని గట్టిగానే ప్రశ్నించారు. నిజానికి ఇపుడున్న సీనియర్లలో అత్యధికులు ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు చేరినవాళ్ళే. అందుకనే వాళ్ళంతా ఇపుడు ఏడు పదుల వయసు దాటిపోయారు.
ఇదే విషయమై లోకేష్ మాట్లాడుతూ మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో ఓడిపోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. నిజంగా ఇది మంచి నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండుసార్లు ఓడిపోతేనే జనాలు తిరస్కరిస్తున్నారని అర్ధమైపోతుంది. అలాంటిది మూడు సార్లు ఓడిపోవటమంటే పార్టీకి గుదిబండకిందే లెక్క. కాబట్టి అలాంటివారికి టికెట్ నిరాకరించటంలో తప్పేలేదు. అయితే వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారు పార్టీలో దాదాపు లేరనే చెప్పాలి.
నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగుసారల్గా ఓడిపోతునే ఉన్నారు. ఇక్కడ టీడీపీ చివరిసారిగా గెలిచింది 1999 ఎన్నికల్లో మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద నాలుగు సార్లు వరుసగా ఓడిపోయిన అభ్యర్ధి ఇంకోరులేరు. అయితే తునిలో నాలుగుసార్లు యనమల సోదరులు ఓడిపోతున్నారు. రెండుసార్లు యనమల రామకృష్ణుడు ఓడిపోతే, రెండుసార్లు ఆయన సోదరుడు యనమల కృఫ్ణుడు ఓడిపోయారు.
అంటే అంటే లోకేష్ తాజా ప్రకటన చూస్తే సోమిరెడ్డి, యనమలను టార్గెట్ చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏది ఏమైనా ఇటు సోమిరెడ్డి, అటు యనమల ఇద్దరు పార్టీకి గుదిబండలుగా తయారయ్యింది మాత్రం వాస్తవం. ఎంఎల్ఏలుగా ఓడిపోయి శాసనమండలి నుండి ఎన్నికై మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. బహుశా ఇదే విషయం లోకేష్ ను బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది. నిజానికి ఇద్దరు కూడా తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయారు. ఏదో చంద్రబాబునాయుడు మొహమాటం వల్ల టికెట్లు సంపాదించుకుంటున్నారంతే. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మందున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ టికెట్లు కట్ చేసి యువతకు కేటాయిస్తే పార్టీకి కాస్త ఊపన్నా వస్తుంది.
This post was last modified on May 28, 2022 3:35 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…