విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ..పుట్టిన రోజు (మే 28) సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇది. వందేళ్ల ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అన్న ప్రశ్న నుంచి ఆయన జాతిని నడిపిన వైనం వరకూ అన్నీ చరిత్రకు తూగే విషయాలే. చరిత్రకూ చర్చకూ తూగే విషయాలే. ఎన్టీఆర్ బాగా చదువుకున్న వారే కాదు.. బాగా చదువుకున్న వారిని ప్రోత్సహించిన వారు కూడా!
యువకులు చదువుకుంటేనే రాణింపు.. చదువుతోనే ఏ రంగంలో అయినా గెలుపు అని చెప్పేవారు కూడా ! బాలయ్యకు కూడా సినిమాల్లోకి వచ్చే ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాల్సిందే అని కండీషన్ పెట్టారు.
తన బిడ్డలు బాగా చదువుకోలేదన్న బాధ ఆయనలో ఉండేదని ఇప్పటికీ ఆయన సన్నిహితులు అంటుంటారు. ఎన్టీఆర్ కు విశ్వనాథ సాహిత్యం ఎంతో ఇష్టం. గొప్ప కవి ఆయన. ఓ విధంగా ఆయనే ఈయనపై గొప్ప ప్రభావం చూపిన కవి కూడా ! విశ్వనాథ జ్ఞాన్ పీఠ్ అవార్డ్ గ్రహీత .. తెలుగు సాహిత్యంలో స్రష్ట. ఎన్టీఆర్ ఆయన్ను అభిమానించారు. నెత్తిన పెట్టుకుని పూజించారు.
గుడివాడ రోజుల్లోనూ ఆయన ఈ విధంగానే ఉండేవారు. తరువాత కూడా ఇదే అభిమానం కొన సాగించారు. విశ్వనాథ తరువాత సినారెను ప్రోత్సహించారు. అటుపై ఎందరెందరినో ప్రోత్సహించారు. చదువుకు ప్రాధాన్యం ఇస్తే జీవితంలో గెలుపు, ఓటములకు అతీతంగా ఎలా ఉండవచ్చు అన్న భావన తెలుస్తుంది అన్న అభిప్రాయం కూడా వారిలో ఉండేది. ఆత్మ విశ్వాసం పెరిగి బిడ్డలు రాణిస్తారు అన్న భావన కూడా ఆయనలో ఉండేది.
ఎన్టీఆర్ చదువుకే కాదు క్రమశిక్షణకూ మంచి ప్రాధాన్యం ఇస్తారు. కథా చర్చలు ఉదయం ఇంటికే మొదలు పెట్టేవారు. ఆయన మంచి భోజన ప్రియులు అని అంటారు. అవును ! అదే సమయంలో అందుకు తగ్గ ఆసనాలు, వ్యాయామం అన్నవి ప్రాధాన్యంగా చేసుకుని జీవించారు. ఎన్టీఆర్ బిడ్డలుకు పెద్దగా చదువు అబ్బలేదు అని చాలా మంది అంటుంటే బాధపడేవారు కూడా ! ఇవన్నీ ఆయనను దగ్గర గా చూసిన వారు చెప్పే మాట.
తన పార్టీలో గ్రాడ్యుయేట్లకు, పోస్టు గ్రాడ్యుయేట్లకు మంచి స్థానం ఇవ్వాలన్నది ఆయన సంకల్పం అని సన్నిహితులు అంటుంటారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో బాగా చదువుకున్న వారికి సముచిత స్థానం దక్కుతుంది అంటే అది పార్టీ వ్యవస్థాపకుడి సంకల్పం. అదేవిధంగా ఎన్టీఆర్ ఆ రోజుల్లో విద్యార్థులకు చదువుల్లో రాణించిన వైనంలో ప్రతిభా పురస్కారాలు అందించేవారు. ఎన్టీఆర్ మరో ఇష్టం చిత్రకళ. ముఖ్యంగా బొమ్మలు వేసే వారిని ఆదరించడం..ఏదేమయినా తనవంతు సాయం ప్రతిభ ఉంటే తప్పక చేసిన రోజులు ఇప్పటికీ చాలా మంది మరువరు. దటీజ్ ఎన్టీఆర్. శత వసంతాల ఎన్టీఆర్ కు జేజేలు
This post was last modified on May 27, 2022 11:15 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…