తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యంతో వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ఏపీ రేషన్ రైస్ మాఫియా చేస్తున్న అక్రమాలపై వివరించారు. ఏయే రూట్లల్లో రేషన్ రైస్ మాఫియా అక్రమంగా తరలిస్తోందనే విషయాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేశారు. తమిళనాడులోని పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేశారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపో తోందని ధ్వజమెత్తారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని పేర్కొన్నారు.
రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. కొంత మొత్తం కర్ణాటకకు కూడా అక్రమంగా తరలిపోతోందని ఆరోపిం చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండి పడ్డారు. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయని వివరించారు.
స్థానిక ప్రజలు సైతం చాలా మంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా.. కేసులు నమోదు కావడం లేదని మండిపడ్డారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు ఇదే అంశం పై చర్యలు కోరుతూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.
This post was last modified on May 24, 2022 5:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…