ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు, తదనంతర పరిణామాలు.. ఆయనకు బెయిల్ లభించడం వంటి కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక వేళ తాము.. రాజకీయ కక్ష సాధింపులకు దిగాలని అనుకున్నా.. రాజకీయ కక్ష సాధింపే నిజమైనా.. ముందు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయించేవాళ్లం అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అదే నిజమైతే.. చంద్రబాబు వదిలేస్తామా? అని మీడియాను ప్రశ్నించారు.
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకే పేపర్ లీక్కు పాల్పడినట్లు వెల్లడించారు. నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు తెలిపారన్నారు. నారాయణ ప్రమేయం ఉండటం వల్లే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారన్నారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని… రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేయించేవారమని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారై విద్యా సంస్థల్లో నేర సంస్కృతిని పాటిస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. చీడ పురుగులా మారి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పరీక్షల వ్యవస్థలో చెద పురుగుల్లా పట్టి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్లో చైతన్య విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని.. వారినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్ వెనుక ఎవరున్నా.. ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభం కానప్పటికీ అక్రమాలు జరిగాయని సజ్జల అన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని తెలిపారు. నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఓ విప్లవకారుడిని అరెస్టు చేసినట్లు హడావిడి చేస్తున్నారని.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టాలా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్నందువల్లే నారాయణను పోలీసులు అరెస్టు చేశారని, రాజకీయ ముసుగులో ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామన్నారు.
This post was last modified on May 12, 2022 8:34 am
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…