అదేంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సర్వాధికారిగా మారటం ఏమిటన్న సందేహం కొందరికి కలగొచ్చు. పేరుకు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటికీ.. ఆయనకు పూర్తి అధికారాలులేవన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీలోని అసమ్మతి ఆయన్ను అడ్డుకుంటూనే ఉంటోంది. ఒక దశలో ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. కాంగ్రెస్ కాని రేవంత్ ను.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా చేసినప్పటికీ.. ఆయనకు పూర్తిస్థాయి పెత్తనం ఇచ్చే విషయంలో ఎదురైన అడ్డంకులు అన్ని ఇన్ని కావు.
వీహెచ్ లాంటి సీనియర్ నేతలకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే పట్టుమని పదివేల ఓట్లు సొంతంగా పడతాయో లేదో కానీ.. మీడియా ముందుకు వచ్చి తరచూ ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. నిజానికి వీహెచ్ లాంటి పలువురు పుణ్యమా అని కాంగ్రెస్ పరువు బజారున పడుతున్న పరిస్థితి. ఇలాంటి వాటి విషయంలో దిద్దుబాట్లు అవసరమన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం గ్రహించినట్లుంది. తాజాగా వరంగల్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభతో తెలంగాణ కాంగ్రెస్ కు తిరుగులేని నాయకుడిగా రేవంత్ ను గుర్తిస్తున్నట్లుగా రాహుల్ తీరు ఉందని చెప్పాలి.
అధినాయకత్వం ఎంపిక చేసిన రేవంత్ కు.. భారీ బహిరంగ సభలో ఆయన పేరు చెప్పినంతనే ఎంతటి ఉత్తేజం.. మరెంతటి ఉత్సాహాన్ని రాహుల్ గుర్తించటమే కాదు.. గతంలో ఎప్పుడూ లేనంత సూటిగా.. సుత్తి లేకుండా పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన కఠిన వ్యాఖ్యలే చేశారు. టీఆర్ఎస్ తో పొత్తు ఎప్పటికి ఉండదన్న మాటను తేల్చటమే కాదు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద గాంధీ కుటుంబం ఎంత కోపంగా ఉందన్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి. తెలంగాణ విషయంలో తాము తీసుకున్న నిర్ణయానికి తాము చెల్లించిన మూల్యం ఎంతన్న విషయం గాంధీ కుటుంబానికి తెలియంది కాదు.
అందుకే ఆయన తన లోపల ఉన్న ఆగ్రహాన్ని తన మాటల రూపంలో స్పష్టంగా చెప్పేశారని చెప్పాలి. అంతేకాదు.. పొత్తు గురించి పార్టీకి చెందిన ఏ నేత అయినా సరే మాట్లాడితే.. వారెంతటి వారైనప్పటికీ తక్షణమే పార్టీ నుంచి తొలగిస్తామన్న విస్పష్ట సందేశాన్ని ఇవ్వటం ద్వారా.. తోక జాడించిన వారి విషయంలో తాము ఎలా వ్యవహరిస్తామన్న విషయాన్ని చెప్పేశారు.
తాజా సభ సక్సెస్ కావటం.. దాని క్రెడిట్ మొత్తం రేవంత్ ఖాతాలోకి వెళ్లటంతో పాటు.. కార్యక్రమాన్ని డిజైన్ చేసిన తీరు.. దాన్ని నిర్వహించిన తీరుతో పాటు.. రేవంత్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ నేపథ్యంలో మిగిలిన వారంతా ఆయన్ను ఫాలో కావటం మినహా మరో అవకాశం లేదన్న విషయాన్ని రాహుల్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి. అంతేకాదు.. రాహుల్.. రేవంత్ మినహా మరే నేత కూడా తన మాటలతో సభికుల్ని అలరించలేకపోయిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే.. తెలంగాణ కాంగ్రెస్ కు తిరుగులేని సర్వాధికారిగా రేవంత్ ను వరంగల్ సభ తేల్చేసిందని చెప్పక తప్పదు.
This post was last modified on May 7, 2022 5:55 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…