వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి పార్టీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంటారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి జాతీయ రాజకీయాల్లోని వివిధ పరిణామాలపై కూడా అదే రీతిలో స్పందిస్తుంటారు.
అయితే, ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లల్లో పడేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నేపాల్ టూర్‌పై విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లను ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
దేశంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయిన సమయంలో రాహుల్ గాంధీ ఖాట్మండులోని నైట్ క్లబ్ లో ఓ మహిళ పక్కన ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో రాహుల్ పక్కన ఉన్న ఆ మహిళ ఎవరు అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ వీడియోపై బీజేపీ నేతలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు సమర్థిస్తూ వివరణలు ఇస్తున్నారు. అయితే, ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైరల్‌గా మారిన రాహుల్ గాంధీ వీడియోపై సంచలన ట్వీట్ చేశారు.
రాహుల్ టూర్‌పై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు మరింత ఆజ్యం పోసేలా విజయసాయిరెడ్డి స్పందించారు. ‘చైనా దౌత్యవేత్తలతో నేపాల్ నైట్ క్లబ్‌లో పార్టీలు చేసుకోవడం కలవరపెడుతోంది. చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతున్నాయి. నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ కూడా అతనితో కనిపించారు. ప్రధాని మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసరంగా ప్రశ్నించింది’ అని ట్వీట్ చేశారు.
ఇప్పటికే రాహుల్ టూర్ రాజకీయ రంగు పులుముకోగా దానికి హనీ ట్రాప్ అంశం జోడించడం అంటే బీజేపీ పెద్దల దృష్టిలో పడేదుకు చేసిన ఎత్తుగడే అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్గీయులు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on May 4, 2022 1:26 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…