తాజా, మాజీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాసు బాగా పనిచేసిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నెల్లూరులోని మాజీ మంత్రి అనీల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్ళారు. వీరిద్దరు సుమారు అర్ధగంటకు పైగా మాట్లాడుకున్నారు. చాలాకాలంగా వీళ్ళద్దరికి ఏమాత్రం పడటం లేదు. అందుకనే మొన్న కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య విబేధాలు మరింతగా పెరిగిపోయాయి.
బాధ్యతలు తీసుకుని మొదటిసారి మంత్రి నెల్లూరుకు వచ్చిన రోజే అనిల్ నగరంలోని క్లాక్ టవర్ సెంటర్లో భారీ సమావేశం నిర్వహించారు. పైగా బలప్రదర్శన కాదని చెబుతున్నా తన సత్తా ఏమిటో చాటి చెప్పటమే అనీల్ ఉద్దేశ్యంగా అర్ధమైపోతోంది. ఒకవైపు అనిల్ సమావేశం మరోవైపు పార్టీ ఆఫీసులో కాకాణి సమావేశం రెండు ప్యారలల్ గా ఒకేసారి జరిగాయి. ఇద్దరి సమావేశాల మధ్యలో మిగిలిన నేతలు ఇబ్బంది పడిపోయారు.
ఇద్దరిలో ఎవరి సమావేశానికి హాజరుకావాలో అర్ధంకాక కొందరు నేతలు రెండు సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అనిల్ సమావేశాన్ని వాయిదా వేయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. ఇదే కాకుండా మంత్రిని ఉద్దేశించి అనిల్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. ఇవన్నీ జగన్ దృష్టికి వెళ్ళాయి. దాంతో ఇక ఉపేక్షిస్తే లాభంలేదని వీళ్ళ గొడవలు మరింతగా పెరిగిపోతాయని జగన్ కు అర్థమైంది. అందుకనే ఇద్దరినీ పిలిపించుకుని ఫుల్లుగా క్లాసు పీకారు.
Yదాని ఫలితంగానే హఠాత్తుగా వీరిద్దరి భేటీ. భేటీ తర్వాత వీళ్ళు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెడతామని చెప్పారు. జగన్ క్లాస్ పీకిన వెంటనే ఇద్దరు విడివిడిగా మాట్లాడినా జాయింట్ కూడా మీడియా సమావేశం పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి. చూస్తుంటే క్లాస్ ప్రభావం బాగానే పనిచేసినట్లుంది. మరి ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుందో చూడాలి.
This post was last modified on April 27, 2022 11:17 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…