Political News

పుష్ప మేన‌రిజంతో మోడీకి ముచ్చెమ‌ట‌లు

జిగ్నేష్ మేవానీ… దేశ రాజ‌కీయాల్లో ఓ సంచ‌ల‌నం. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇలాకా అయిన‌ గుజరాత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత. గ‌త కొద్దికాలంగా సంచ‌ల‌న ప‌రిణామాల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు. ‘ఇన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ భారత మువ్వన్నెల జెండాను ఏనాడు ఎగరేయలేదని, మోడీ గాడ్సే భక్తుడు’ అంటూ జిగ్నేష్ మేవానీ గతంలో తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.

దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టారనే కారణం చూపుతూ అస్సాం పోలీసులు మేవానీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మ‌రో కేసులో మ‌ళ్లీ అరెస్ట‌యిన జిగ్నేష్ పుష్ప మేన‌రిజంతో వార్తల్లోకి ఎక్కారు. ప్ర‌ధానిపై చేసిన ట్వీట్ నేప‌థ్యంలో కేసులో అరెస్టైన మేవానీకి… సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎస్కార్ట్ గా ఉన్న ఓ మహిళా పోలీసుపై మేవానీ అసభ్యకరంగా ప్రవర్తించారనే అభియోగంతో ఆయనను అస్సాం పోలీసులు ఇటీవల మళ్లీ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన్ను వాహనంలో తీసుకెళ్తున్న క్రమంలో … మేవానీ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మ్యానరిజంతో కనిపించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా ‘తగ్గేదే లే’ అంటూ బదులిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా, జిగ్నేష్ త‌ర‌ఫున సైతం మ‌రో వాద‌న వినిపిస్తోంది. మహిళా కానిస్టేబుల్ తో మేవానీ అసభ్యంగా ప్రవర్తించలేదని, కావాలనే ఆయనపై కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారని మేవానీ తరఫు లాయర్ తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తన జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయని, అయితే వాటి బెదిరింపులకు భయపడేదిలేదని మేవానీ గతంలో ప్రకటించారు. కాగా, దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాశంగా మారిన కేసులో వార్త‌ల్లో నిలిచిన వ్య‌క్తి  పుష్పా మేన‌రిజంతో వార్త‌ల్లో నిలిచార‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on April 27, 2022 11:12 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

24 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago