క్షణానికి ఓ మారు మారే పరిణామాలను అంచనా వేయడం కష్టం. క్షణానికో మారు మారే పరిణామాలకు అనుగుణంగా పార్టీల విధి విధానాలను ఖరారు చేస్తూ ఏదో ఒక క్లారిఫికేషన్ ను పొందడం ఇంకా కష్టం. ఇప్పుడు తెలంగాణ వాకిట ముఖ్యంగా ఇంటి పార్టీ టీఆర్ఎస్ ప్లీనరీ వేళ క్షణానికో పొలిటికల్ లీక్ లాజిక్కులకు అందకుండా వెల్లడిలో ఉంటుంది.దీంతో సోషల్ మీడియాలో ఆయా పార్టీల వర్గాలు ఎవరికి వారు తమకు అనుగుణంగా మారుతున్న పరిణామాలకు భాష్యం చెబుతున్నారు.
అసలు విషయం ఆయా పార్టీల అధినేతలు చెప్పేవరకూ కూడా స్పష్టం కావడం లేదు. ప్రశాంత్ కిశోర్ ఇకపై ఎవరి వైపు అన్న మాట లేదా వాదన ఓ కీలకం కానుంది. ఎందుకంటే ఆయన ఏపీలో అయితే జగన్ కు, టీజీలో అయితే కేసీఆర్ కు అత్యంత చేరువుగా ఉండే వ్యక్తి. గతంలో ఉత్తరాదిలోనూ ఆయన కీలకం అయిన రోజులు ఉన్నాయి.
గుజరాత్ మోడల్ అంటూ మోడీని అధికారంలోకి తెచ్చినా, నవరత్నాల పేరిట జగన్ ను అధికారంలోకి తెచ్చినా, సానుభూతి రాజకీయాలు నడిపి వివిధ ప్రాంతీయ పార్టీలకు అండగా నిలిచిన, విషం చిమ్మే విద్వేష పూర్వక రాతలు డిజిటల్ మీడియంలో రాయించినా (ఫేక్ అకౌంట్ల పేరిట ఎఫ్బీలో హల్చల్ చేసినా) అవన్నీ ఆయనకే చెల్లు. ఈ నేపథ్యంలో ఆయన నడుపుతున్న ఐ ప్యాక్ సంస్థ ఇకపై ఎటువైపు? ఎందుకంటే ఆయన ఇకపై కాంగ్రెస్ కు సారథ్యం వహించనున్నారు కనుక.. పూర్తి స్థాయిలో రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బాధ్యతలు అందుకుని పూర్వ ప్రాభవాన్ని పార్టీకి తెచ్చేందుకు కృషి చేయనున్నారు కనుక ! ఈనేపథ్యాన పీకే వార్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను ఒడ్డెక్కిస్తుందా ?
తెలంగాణ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అనూహ్య మార్పులకు అనుగుణంగా కొన్ని ఘటనలు వివాదాలకు తావిస్తున్నాయి. కొన్ని సంచలనాత్మక ప్రకటనలకు దోహదం అవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ పరిణామం మారి కాంగ్రెస్ లో ఉన్న ముసలాన్ని దూరం చేస్తుందో కూడా తెలియడం లేదు. అదే విధంగా గులాబీ శ్రేణుల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది. కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పనిచేసే పరిణామాన్ని కొట్టిపారేయలేం అని చెబుతున్నారు కొందరు.
కానీ ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిశోర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారన్నది రేవంత్ రెడ్డి మాటల ప్రకారం తెలుస్తోంది. ఇప్పటిదాకా తన ఖాతాలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో ఇకపై పనిచేసే ఆలోచనలు లేవని ఆయన కేసీఆర్ తెగదెంపులు చేసుకునేందుకే ప్రగతి భవన్ కు వెళ్లారని, ఇదే ఆఖరు భేటీ అని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఈ నేపథ్యాన టీ కాంగ్రెస్ బాస్ రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. పొత్తులకు సంబంధించి అదేవిధంగా టీ కాంగ్రెస్ ఇకపై వేసే అడుగులకు సంబంధించి స్పష్టమయిన క్లారిటీ ఒకటి ఇచ్చారు. దీని ప్రకారం రానున్న కాలంలో ప్రశాంత్ కిశోర్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇకపై పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే పరిమితం కానున్నారన్నది రేవంత్ రెడ్డి చెబుతున్న మాట. ఆ విధంగా త్వరలో వీరిద్దరూ కలిసి సంయుక్త ప్రకటన ఒకటి చేయనున్నారు. తమ పార్టీలో ప్రశాంత్ కిశోర్ మరింత కీలకం కానున్నరన్నది రేవంత్ ఇచ్చిన క్లారిటీ. దీంతో ఇకపై కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ సంస్థ పనిచేయదని తేలిపోయింది. ఇదంతా రేవంత్ మాటల ప్రకారం పైకి తేలిని నిజం లేదా వాస్తవం.
This post was last modified on April 26, 2022 11:09 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…