“మనం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రజల్లోకి వెళ్లండి. ఆయా పథకాలను వివరించండి. వారి బాధలు కూడా తెలుసుకోండి“ అని సీఎం జగన్ తన పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. కానీ, ఎవరు వింటున్నారు? ఎవరు నిజంగా ప్రజల మధ్య ఉంటున్నారు? అనే విషయాలు ఆరా తీస్తే.. 10 పర్సంట్ నేతలు మాత్రమే ఉంటున్నారని.. పీకే చేసిన తాజా సర్వే స్పష్టం చేసింది. నిజానికి ఏ పార్టీకైనా.. ఏనేతకైనా.. ఆత్మ విమర్శ అవసరం. తాము ఏం చేస్తున్నాం.. ఏం చేయాలి.. ఏం చేస్తామని.. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చాం (స్థానికంగా ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలు కూడా ఇచ్చారు).. ఇప్పుడు ఎలావ్యవహరిస్తున్నాం.. అనేది!
అంతేకాదు.. ఏ నేతకైనా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు.. వారికి మనకు మధ్య ఉన్న బంధం ఎలా ఉంది..? అనే విషయాలు తెలుసుకోవడం కూడా అవసరం. ఇది లేకపోతే.. ఎంతటి నాయకుడు అయినా.. ప్రజల ముందు.. వారి ఇచ్చే తీర్పు ముందు పిల్లి మొగ్గలు వేయాల్సిందే. ఈ నేపథ్యంలో నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదే విషయాన్ని పీకే నివేదిక వెల్లడించిందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నాయకులు తాము చేస్తున్న తప్పులను గుర్తించడం.. వాటిని సరిదిద్దుకోవడం వంటి చర్యల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా ఎవరైనా తప్పులు చేసే వారే. తప్పులు చేయకుండా ఎవరూ ఉండరు. కానీ, వాటిని గుర్తించడం అనేది నేతలకు అత్యంత అవసరం. పైగా రాజకీయంగా కొత్త నేతలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 3 సంవత్సాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వీటిలో రెండేళ్లు అసలు కరోనాతో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లపాటు.. అత్యంత కీలక మైన సమయం. మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. ఎమ్మెల్యేలుగా తాము విజయం దక్కించుకోవాలన్నా.. వ్యూహం సిద్ధం చేసుకోవాలి.
ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు రెండే వ్యాపకాలు కనిపిస్తున్నాయి. అందితే పదవి, లేకపోతే.. వ్యాపారం. ఈ రెండే తప్ప.. మరో వ్యాపకం కనిపించడం లేదని పీకే నివేదిక పేర్కొంది. కానీ, వాస్తవానికి ప్రజల కోసం.. పాకులాడితేనే ఉన్న పదవులు మిగిలి.. మళ్లీ నెగ్గుతారు. లేకపోతే.. మాజీలుగా మార్చేందుకు ప్రజలకు ఎక్కువ సమయం పట్టదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒకవైపు.. ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత జగన్ ఎమ్మెల్యేలకు పదేపదే నియోజకవర్గాల్లో ఉండాలని.. ప్రజల సమస్యలు పట్టించుకోవాలని.. కోరుతున్నారు.
అయినప్పటికీ.. ఒకరిద్దరు తప్ప (ఉమ్మడి జిల్లాకు) మిగిలిన వారు వారి సొంత కార్యక్రమాల్లోనే మునిగిపోతున్నారు. జగన్ ఇమేజ్‌ను నమ్ముకున్నాం.. కదా.. మనకేం కాదులే. అనుకుంటే.. పొరపాటే అని కూడా నివేదిక వెల్లడించినట్టు సమాచారం. అందుకే ఇటీవల కాలంలో జగన్ తన ఇమేజ్‌పై ఆధారపడొద్దని పరోక్షంగా నేతలకు సెలవిస్తున్నారు. “మీరు గెలవాలి.. పార్టీని గెలిపించాలి“ అని పిలుపు ఇస్తున్నారు. అయినా, నేతలు ముందుకు కదలడం లేదనే మే 1 నుంచి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం పెట్టారు. మరి దీన్నయినా.. నాయకులు సక్సెస్ చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on April 25, 2022 3:01 pm
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఇటీవల జరిగిన దాడి వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దొంగతనం…
ఒక్కో జానర్కు ఒక్కో రీచ్ ఉంటుంది. కొన్ని జానర్ల సినిమాలకు వసూళ్ల పరంగా పరిమితులు కూడా ఉంటాయి. వందల కోట్ల…
తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది. నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత…
బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ…
నిన్న ప్రకటించిన పద్మ పురస్కారాల్లో బాలకృష్ణతో పాటు శోభనకు పద్మభూషణ్ దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ…