టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం.. వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి అవడం. ఇదే కనుక జరిగితే.. ఇక, ఎప్పటికీ.. వైసీపీని అధికారంలోకి రాకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బలమైన నాయకత్వాన్ని ఎదిరించడమే ఇప్పుడు చంద్రబాబు ముందున్న లక్ష్యంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆయనే స్వయంగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. కానీ, వయసు సహకరిస్తుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
ప్రస్తుతం చంద్రబాబువయసు 73 సంవత్సరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈవయసులో ఆయన పర్యటించడం సరైందేనా? అనేది కూడా సందేహం. ఇదిలావుంటే.. మరో రెండు కీలక ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఒకటి.. చంద్రబాబు చేయాల్సింది ఏంటి? ఏం చేస్తున్నారు? అనేదే! ప్రస్తుతం చంద్రబాబు ప్రజల్లో తిరిగితే.. ఆయన ఇమేజ్ పెరుగుతుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ, ఇప్పుడు చంద్రబాబు కు ఇమేజ్ లేకపోతే కదా. ఆయనపై ప్రజలకు విశ్వసనీయత లేకపోతే కదా! అంటున్నారు పరిశీలకులు.
చంద్రబాబుకు ఏపీ ప్రజలపై ఎప్పటికీ విశ్వస నీయత ఉంది. ఉంటుంది. ఆయనను విజన్ ఉన్న నాయకుడిగా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఆయన విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అదే సమయంలో పార్టికి కూడా విశ్వసనీయత ఉంది. పార్టీ విషయంలోనూ ప్రజలు పాజిటివ్‌గానే ఉన్నా రు. పార్టీ విషయంలో ఎలాంటి బేధాభిప్రాయం లేదు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు చేయాల్సింది జిల్లాల యాత్రేనా? అసలు ఆయనే రంగంలోకి దిగాలా? అనేది ప్రశ్న. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ప్రజల్లో నమ్మకం లేనిదల్లా.. నాయకులపైనే. గత ఎన్నికల్లోనే ఈ విషయం బయట పడింది.
అందుకే ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ, ఫలితం దక్కలేదు. మరి ఇప్పుడు మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలోనూ.. టీడీపీ నాయకుల గ్రాఫ్ పెరిగిందా? ప్రజలు వారిని విశ్వసిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. ఈ విషయాన్ని గమనిస్తే.. చంద్రబాబు కాదు.. జిల్లాలపర్యటన చేయాల్సింది.. అసలు టికెట్లు పొందే నాయకులేనని అంటున్నారు పరిశీలకులు.
వారిపై ప్రజలకు విశ్వసనీయతపెరిగితే.. చాలని.. చంద్రబాబు ఎన్ని జిల్లాల పర్యటనలు చేసినా.. వైసీపీపై ఎంత విరుచుకుపడినా.. క్షేత్రస్థాయిలో నాయకులపై ప్రజలకు విశ్వాసం కలగకపోతే.. కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాయకులను రంగంలోకి దింపి.. పైనుంచి చంద్రబాబు మేనేజ్ చేస్తే చాలునని సూచిస్తున్నారు.
This post was last modified on April 25, 2022 1:55 pm
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…