Political News

ఏపీ అంటే జగన్.. చంద్రబాబేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నంతనే అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తప్పించి మరే నేత ప్రధాన మీడియాకు కనిపించదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరెన్ని చెప్పినా ఏపీ మీడియాలో రెండు పెద్ద కుంపట్ల ఉన్నాయని చెప్పాలి. ఈ కుంపట్లు జగన్.. చంద్రబాబు ఆప్షన్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవటమే తప్పించి.. అందుకు భిన్నంగా ఏపీకి మేలు చేస్తున్నవారు.. కష్టంలో ఉన్న వారికి సహాయక చర్యలు చేపట్టేవారి గురించి ప్రధాన మీడియాకు పట్టదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

నిత్యం ఏపీ అధికార.. విపక్షాల మధ్య సాగే పోరు.. దానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు మాత్రమే అన్నట్లుగా ఏపీ మీడియా నడుస్తోంది. రాజకీయ పోరు మొత్తం రెండు ప్రధాన పార్టీల మధ్య సాగుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారే తప్పించి.. మంచి.. చెడు విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. తరచి చూస్తే.. ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులు.. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక్కరంటే ఒక్కరికి పట్టని పరిస్థితి.

ఇలాంటి వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి.. కౌలు రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్న ప్రాంతాల్ని గుర్తించటం.. వారి వద్దకు తానే వెళ్లేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకొన్న పవన్.. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి  రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు నడుస్తున్న రాజకీయానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించాల్సిన అవసరం లేదు. కనీసం పవన్ రైతు భరోసా యాత్రను కాస్తంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఏపీ అంటే జగన్.. చంద్రబాబు మాత్రమే కాదు.. చాలామంది నేతలు ఉన్నారన్న విషయాన్ని ఇరు వర్గాలకు చెందిన మీడియా సంస్థలు.. వారి ఫాలో అప్ గా ఉండే సంస్థలకు పవన్ లాంటి వాళ్లు పట్టటం లేదన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ తరహా మీడియా.. తన గౌరవాన్ని తాను తగ్గించుకోవటం తప్పించి మరింకేమీ లేదంటున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఫోకస్ చేయటం ద్వారా.. కౌలు రైతుల ఆత్మహత్యల ఇష్యూను ప్రభుత్వ ప్రాధామ్యాయ అంశంగా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ.. ఏపీలోని మీడియాను చూసినప్పుడు అలాంటి సోయి లేదన్నట్లుగా ఉంది. ఒకవేళ ఉంటే.. పవన్ యాత్రను ఎందుకు హైలెట్ చేయటం లేదన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిందెవరు?

This post was last modified on April 23, 2022 8:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

IPL షెడ్యూల్.. బీసీసీఐ బిగ్ సర్‌ప్రైజ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…

25 mins ago

రాహుల్ ఔట్: ఇది న్యాయమేనా?

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా…

33 mins ago

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…

48 mins ago

‘ఆర్‌సీ 16’ షూటింగ్ షురూ.. మ‌రో వారం చ‌ర‌ణ్ అక్క‌డే!

గేమ్ ఛేంజ‌ర్ ఇంకా విడుద‌లే కాలేదు రామ్ చ‌ర‌ణ్ అప్పుడే త‌న త‌దుప‌రి సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…

50 mins ago

పార్టీ మార్పులపై హైకోర్టు తుదితీర్పు: బీఆర్ఎస్ కు షాక్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…

1 hour ago