ఏపీ అధికార పార్టీలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల కేబినెట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి జగన్.. తాజాగా సలహాదారులను కూడా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 56 మంది సలహాదారుల్లో ఓ ఐదారుగురు మినహా.. మిగిలిన వారిని మార్చుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేవలం ఐదు లేదా.. ఎనిమిది మందిని మాత్రమే కొనసాగిస్తారని అంటున్నారు.
అయితే.. ఇలా పక్కన పెట్టేవారికి.. క్షేత్రస్థాయిలో మళ్లీ వ్యూహాత్మక పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని.. చెబుతున్నారు. గతంలో పార్టీకి అన్ని రూపాల్లోనూ సాయం చేసిన వారికి జగన్ సర్కారు ఏర్పడిన వెంటనే.. ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో భాగస్వామ్యం కల్పించారు. అయితే.. వీరిని మార్చుతానని ఆయన ఎప్పుడూ..చెప్పలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో.. సలహాదారులను కూడా మార్చి.. వచ్చే ఎన్నికలకు వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన చూస్తున్నారు.
ఎందుకంటే.. వచ్చే ఎన్నికలు అంత ఈజీగా అయితే.. ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని రూపాల్లోనూ పోటీ.. అన్ని వైపుల నుంచి పోటీ ఉంటుంది. దీంతో మేధావి వర్గాన్ని.. ముఖ్యంగా ఎన్నారై వర్గాన్ని కూడా వైసీపీ కూడగట్టడం ద్వారా.. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న సలహాదారులను క్షేత్రస్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం ఉన్న 56 మందిలో 30 స్థానాలకు కుదించి.. వారిలోనూ ఐదారుగురిని వినియోగించుకుని.. మిగిలి 20 స్థానాల్లో కొత్తవారిని నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మీడియాచర్చల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న న్యాయవాదులు.. ఇతరత్రా వర్గాలకు సలహాదారులుగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. పార్టీని పరోక్షంగా బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on April 23, 2022 10:28 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…