ఏపీలో రాజకీయ యాత్రలు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఒకవైపు.. అధికార పార్టీ వైసీపీ, మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా యాత్రలకు రెడీ అవుతున్నాయి. దీంతో జనాలకు పొలిటికల్ పండుగేనని అంటున్నారు. మే 1వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ `ఇంటింటికీ వైసీపీ` పేరుతో యాత్రలు ప్రారం భిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. జూన్ 1 నుంచి టీడీపీ జిల్లాల యాత్రకు రెడీ అవుతున్నారు. వైసీపీ ఇప్పటికే.. జిల్లాలకు బాధ్యులను నియమించింది. అదేసమయంలో వీరిని నడిపించేందుకు ఇంచార్జ్‌లను నియమించింది. దీంతో వచ్చే నెల 1 నుంచి ఇంటింటికీ వైసీపీ ప్రారంభం కానుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రజల వద్దకు వెళ్లడం.. ప్రభుత్వం చేసిన కార్యక్రమా లు, చేస్తున్న సంక్షేమాన్ని వివరించనున్నారు. దీనికి సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పార్టీ నాయకులకు దిశానిర్దేశించారు. అంతేకాదు.. ప్రతి ఎమ్మెల్యే కూడా.. తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి మూడుసార్లు ప్రజలకు చేరువ అవ్వాలని నిర్దేశించారు. అంతేకాదు.. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు.. ప్రజలను పేరు పెట్టి పిలిచేంత చనువును సంపాదించాలని కూడా చెప్పారు.
మొత్తంగా చూస్తే.. వైసీపీ అధిష్టానం యాత్రలపై తీవ్రస్థాయిలోకసరత్తు చేసింది. రోడ్‌మ్యాప్ కూడా రెడీ చేసుకుంది. దాని ప్రకారమే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఆయా కార్యక్రమాలపై కుస్తీ పడుతున్నారు. మరోవైపు… వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా యాత్రా స్పెషల్‌కు రంగం రెడీ చేసుకుంది. మేనెలలో నిర్వహించే మహానాడు ముగియగానే.. ప్రజల్లోకి వెళ్లాలని.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు.
వచ్చే ఏడాది కాలంలో జిల్లాల్లో చుట్టేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో రాబోయే ఏడాది కాలం పాటు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల యాత్రా స్పెషల్ జనాలకు రాజకీయ వేడుక చేయనుందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఈ రెండు పార్టీలు.. తాము చెప్పాలనుకున్నది చెప్పేసి.. యాత్రను ముగిస్తాయా? లేక.. ప్రజల సమస్యలను కూడా వినేందుకు ప్రాధాన్యం ఇస్తాయా? అనేది చూడాలి. ఎందుకంటే.. ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ, వారు వీరిలాగా యాత్రలు చేయలేరుకదా!!
This post was last modified on April 22, 2022 11:06 am
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…