వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల నియామకాల్లో అనూహ్యం అనుకున్న పరిణామాలు కొన్ని జరిగాయి. అయితే ఇవి అనూహ్యమా లేకా అవసరార్థం చేసిన నిర్ణయమా అన్నది ఇప్పటికీ అంతు తేలడం లేదు. వాస్తవానికి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా వచ్చేందుకు ఎప్పటి నుంచో మంత్రి బొత్స కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ సాయి రెడ్డి ఉన్న కారణంగా బొత్స హవాకు కానీ కనీసం ఆయన మాటకు కానీ విలువ లేకుండా పోయిందని ఓ సమాచారం. ఇదే ఓ వాదన కూడా ! దీంతో ఓ విధంగా బొత్స కలలు అయితే నెరవేరకపోయినా, ఇంతకాలం బొత్సకూ అదేవిధంగా ఆయన సామాజికవర్గానికే చెందిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీను (నిన్నమొన్నటి వరకూ టూరిజం శాఖ మంత్రి) అడ్డుగా నిలిచిన సాయిరెడ్డిని పార్టీ ఎట్టకేలకు తప్పించడం ఓ విధంగా కాపు సామాజికవర్గానికి సంబంధించిన నేతలకు ఊరట ఇచ్చే విషయమే!
సాయిరెడ్డి అంత కాకపోయినా సుబ్బారెడ్డి మాత్రం మరీ ! తమకు ఇబ్బందికరంగా ఉండరనే విశ్వసిస్తున్నారు బొత్స మరియు అవంతికి చెందిన వర్గీయులు. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంపై సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో విశాఖ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నా ఎంపీ విజయ సాయిరెడ్డిని వైసీపీ అధినాయకత్వం తప్పించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాస్తవానికి ఉత్తరాంధ్ర ప్రాంత సమన్వయకర్త పోస్టు అన్నది చాలా పెద్ద పోస్టుగా ఆయన భావించేవారు. ఆ విధంగా ఆయన కార్యకలాపాలు చక్కదిద్దాలని పరితపించేవారు. తన మాటకు ఎదురే ఉండబోదన్న విధంగా ఆయన అనుకునేవారు కూడా ! అయితే ఉత్తరాంధ్ర పరిధిలో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి.
వీటిలో శ్రీకాకుళం మినహా అన్నింటినీ వైసీపీనే గెలుచుకుంది. ఆ విధంగా బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), ఎంవీఎస్ మూర్తి (విశాఖ), గొడ్డేటి మాధవి (అరకు), డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి (అనకాపల్లి) తో సహా వారి అనుచరులు కూడా విజయ సాయిరెడ్డి ఏం చెబితే అది. ఎంత చెబితే అంత ! అనే విధంగానే ఉండేవారు. దీంతో సాయి రెడ్డి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటుచేసుకుని ఉత్తరాంధ్ర కేంద్రంగా రాజకీయం నడిపేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో తన వర్గాన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉండేవారు.
ఈ క్రమంలోనే మంత్రి అవంతి శ్రీనుకూ ఆయనకూ మధ్య దూరం కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఇదే అదునుగా చాలా మంది సాయి రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో మంత్రి కి సంబంధించి కొంత అసత్య ప్రచారం కూడా చేశారన్న వాదన కూడా ఉంది. ఆ విధంగా అవంతి శ్రీను మంత్రి పదవి కోల్పోయి విశాఖ జిల్లా వైసీపీ విభాగానికి అధ్యక్షులుగా తాజాగా నియమితులయ్యారు. ఇక్కడికి రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు. దీంతో ఇంతకాలం తనకు తలనొప్పి అని భావించిన సాయిరెడ్డి తప్పుకున్నారన్న ఆనందం ఇప్పుడిప్పుడే అవంతి శ్రీనులో కలుగుతోంది.
వాస్తవానికి ఆయన ఫోకస్ విజయనగరం మరియు శ్రీకాకుళంపై కూడా ఉండేది కాదు. కరోనా సమయంలో శ్రీకాకుళంలో కూడా తన ట్రస్ట్ తరఫున సేవలు చేసినా కూడా ఈ జిల్లాపై ఆయనకు పెద్దగా ఎందుకనో మొదటి నుంచి శ్రద్ధ లేదు. ఆ విధంగా ఈ జిల్లా పరిణామాలను ఆయన పట్టించుకునే వారు కాదు. అయినా సరే ఆశావహులు ఎవ్వరైనా సరే సాయిరెడ్డి జిల్లాకు వచ్చారంటే చాలు కలిసి తమ గోడు మాత్రం వెళ్లబోసుకునేవారు. అంతవరకే తప్ప ఆయన ఊళ్లోకి వస్తున్నారంటే మరీ! టూ మచ్ గా హడావుడి చేసే నాయకులు అయితే శ్రీకాకుళం లో లేరు. లేకపోవడం విశేషం కూడా !
This post was last modified on April 20, 2022 5:03 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…