టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈగ వాలనివ్వబోమంటూ.. తరచుగా వ్యాఖ్యలు చేసే పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ.. బుద్ధా వెంకన్న తాజాగా మరింత హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు రక్షణ కోసం.. తాము 100 మందితో ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశామని.. ఆయన ప్రకటించారు. చంద్రబాబుపై ఈగ కూడా వాలనివ్వబోమని, ఎవరైనా చేయి వేస్తే.. మటాషేనని.. ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడ వన్‌టౌన్‌లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
72 కిలోల కేక్‌ను కట్ చేయడంతోపాటు 72 మంది పేద మహిళలకు పట్టుచీరలు పంపిణీ చేశారు. అదే వి ధంగా చంద్రబాబు కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. అనంతరం.. వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు పై చెత్త వాగుడు వాగే వాళ్లకు హెచ్చరిక చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు రక్షణ కోసం.. 100 మంది సూసైడ్ బ్యాచ్ ను తయారుచేసుకున్నామని చెప్పారు. వచ్చే రెండేళ్లు చంద్రబాబు, ఆయన కుటుంబం జోలి కొస్తే ఎలాంటి వారైనా.. ఎంతటి వారైనా చంపడానికైనా చావడానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదన్నారు. చంద్రబాబును టచ్ చేయాలను కుంటే వాళ్ళు అయిపోయినట్లేనని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు మీద దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ఆదేశిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎవరైనా చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నారు. మరి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఐటీడీపీ వినూత్న విషెస్!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీడీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు హయాంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఆన్లైన్‌లో అధినేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నాటి అభివృద్ధి- నేటి అరాచకం మధ్య తేడాను ప్రజలు గమనించాలంటూ ఐటీడీపీ వీడియోలు విడుదల చేసింది. కియా, హెచ్ సీఎల్, పట్టిసీమ, హైటెక్ సిటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వద్దకు వెళ్లి అక్కడి నుంచి చంద్రబాబుకు ఐటీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on April 20, 2022 4:39 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…