Movie News

రాజమౌళి డైవర్షన్… వంగా డైరెక్ట్ ఎటాక్

సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ సినిమాల అప్‌డేట్స్ ఇచ్చే విషయంలో రకరకాల వ్యూహాలు ఫాలో అవుతుంటారు. అమెరికా చార్లెట్ నగరంలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాంటి హడావుడి లేకుండా సినిమా స్టేటస్ ను ఆయన ఓపెన్ గా చెప్పేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే దర్శకధీరుడు రాజమౌళి సినిమా అప్‌డేట్స్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఒక ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు వేరే ఈవెంట్లలో లేదా ఇతర సినిమాల వేడుకల్లో అసలు విషయాలు రివీల్ చేయడానికి ఆయన అస్సలు ఇష్టపడరు. ఎవరైనా అప్‌డేట్ గురించి ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేస్తూ సమాధానాలు ఇస్తుంటారు. సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాత్రమే అధికారికంగా వివరాలు వెల్లడించడం రాజమౌళి అనుసరించే ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ. ముఖ్యంగా ఆయన సినిమాలో నటించే వారు, వర్క్ చేసేవారికి కూడా ముందే లీక్స్ ఇవ్వకండి అంటూ రూల్స్ పెట్టేస్తారు.

కానీ సందీప్ రెడ్డి వంగా రూట్ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ సందర్భంలోనైనా సరే అభిమానులు అడగ్గానే కాదు లేదు అనకుండా సూటిగా సమాధానం చెప్పేస్తున్నారు. గతంలో కూడా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ కాస్ట్ ఎవరనే విషయాలను చాలా నార్మల్ గా వేరే ఈవెంట్స్ లోనే షేర్ చేసుకున్నారు. ఈ అమెరికా ఈవెంట్ లో కూడా ప్రభాస్ స్పిరిట్ సినిమాకు సంబంధించి 40 శాతం షూటింగ్ అయిందని, అక్టోబర్ లేదా నవంబర్ లో 10 రోజుల పాటు యాక్షన్ బ్లాక్స్ తీయబోతున్నారనే క్రేజీ డీటెయిల్స్ ను సింపుల్ గా చెప్పేశారు.

సినిమా అనేది కంటెంట్ తోనే క్లిక్ అవ్వాలని, దానికి అనవసరమైన సస్పెన్స్ లు అవసరం లేదని నమ్మే వ్యక్తి వంగా. అందుకే అడిగిన వెంటనే ఎలాంటి దాపరికం లేకుండా అప్‌డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతుంటారు. రాజమౌళి ఒక పద్ధతి ప్రకారం పబ్లిసిటీని బిల్డ్ చేస్తే, వంగా మాత్రం కన్వెన్షనల్ పద్ధతులకు దూరంగా తనదైన ఓపెన్ టాక్ తో హైప్ క్రియేట్ చేస్తారు. ఏదేమైనా ఈ ఇద్దరిదీ సక్సెస్ ఫుల్ స్ట్రాటజీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి ఫాలో అయ్యే సీక్రెట్ మైంటైన్ చేసే విధానం ఒక రకమైన క్రేజ్ తెస్తే, వంగా ఫాలో అయ్యే బోల్డ్ అప్రోచ్ డిఫరెంట్ వైబ్ ను క్రియేట్ చేస్తుంది. 

This post was last modified on July 21, 2026 9:37 am

Share

Recent Posts

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 minutes ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

1 hour ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

3 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

3 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

8 hours ago

గొప్ప నిర్ణ‌యం: ఏపీలోనే విదేశీ విద్య‌!

ప్ర‌స్తుతం విదేశీ విద్య‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ స‌హా దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్‌, ర‌ష్యా స‌హా..…

10 hours ago