Movie News

ఒకేరోజు రెండు వయసు వ్యత్యాసం సినిమాలు

1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన పాయింట్ ని హ్యాండిల్ చేసిన విధానం జనాలకు నచ్చింది. అందులో హీరో కన్నా హీరోయిన్ వయసు పెద్దది. అందుకే కుటుంబాల వైపు నుంచి అభ్యంతరాలు వస్తాయి. వాటిని దాటుకుని ప్రేమకథ ఎలా గెలిచిందనేది అసలు పాయింట్. అప్పట్లో సచిన్ టెండూల్కర్ దంపతులను చూసే దర్శకుడు వీరు ఈ కథను రాసుకున్నారని మీడియా కథనాలు వచ్చాయి.

తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఆగస్ట్ 14 దీనికి వేదిక కానుంది. ఆ రోజు విడుదల కానున్న విశ్వనాథ్ అండ్ సన్స్ లో నలభై వయసు దాటిన సూర్యని పాతికేళ్ల అమ్మాయి మమిత బైజు ప్రేమిస్తుంది. ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించని ఈ సబ్జెక్టుని దర్శకుడు వెంకీ అట్లూరి చాలా సెన్సిబుల్ గా తెరకెక్కించారని ఇన్ సైడ్ టాక్. 1991 అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా వచ్చిన లమ్హే దీనికి స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో వెంకీ స్వయంగా ఆ విషయాన్ని పంచుకున్నారు.

సరిగ్గా అదే రోజు తమిళ హీరో కెవిన్, నయనతార జంటగా హాయ్ రాబోతోంది. చిన్న టీజర్ ద్వారా డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇందులో కెవిన్, నయన్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. అయినా సరే ఇద్దరూ ఎలా లవ్ లో పడ్డారు, లేదా వేరే ఏదైనా ట్విస్టు ఉందానేది తెర మీద చూడాలి. రెండు సినిమాలు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో రామ్ కామ్స్ గా రూపొందటం విశేషం. కమర్షియల్ అంశాలకు దూరంగా ఎమోషన్స్ కు పెద్ద పీఠ వేస్తూ వీటిని ఒకేసారి రిలీజ్ చేయనుండటం కాకతాళీయం.

ఒకవేళ ఇవి విజయం సాధిస్తే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయని చెప్పొచ్చు. తెరమీద జంటగా కనిపించే హీరో హీరోయిన్ మధ్య ఎంతైనా వయసు వ్యత్యాసం ఉండొచ్చు. ఆడొచ్చు, పాడొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ పాత్రల మధ్య సంబంధాల పరంగా ఏజ్ డిఫరెన్స్ చూపిస్తేనే ప్రేక్షకులు అంత సులభంగా రిసీవ్ చేసుకోలేరు. లమ్హే అందుకే ఫ్లాప్ అయ్యింది. మరి ఆగస్ట్ 14 వీటిని సక్సెస్ చేయించడం ద్వారా ఒక కొత్త జానర్ కి దారి వేస్తుందేమో చూడాలి.

This post was last modified on July 21, 2026 1:03 pm

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

49 minutes ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

6 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

7 hours ago