గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు.. మాజీ హోం మంత్రి.. మేకతోటి సుచరిత.. తనకు తిరిగి మంత్రి పదవి దక్కలేదని.. భావిస్తూ..తీవ్రస్థాయిలో అలిగిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు… దీనిని ఎంపీ మోపిదేవికి ఇచ్చినట్టుగా కుమార్తె తో ప్రకటన చేయించారు. తర్వాత.. జరిగిన పరిణామాల నేపథ్యంలో మొత్తానికే ఎసరు తప్పదని అనుకు న్నారో.. ఏమో.. వెంటనే రంగంలోకి దిగి సరిదిద్దుకునే ప్రయత్నాలు చేశారు.
ఇది ఒకవైపు.. పార్టీలో ఇంకా పరిస్థితి సర్దు బాటు కాలేదనే సంకేతాలు ఇస్తున్నాయి. అంటే.. సుచరిత.. ఇప్పట్లో యాక్టివ్ కావడం కష్టమే. మళ్లీ ఆమె ఎన్నికల ముందు వరకు.. ఆరోగ్యం బాగోలేదనే స్టోరీనే వినిపించడం ఖాయమని.. వైసీపీ నేతలే అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే… ఇప్పుడు మరో ఎస్సీ నాయకురాలు… వైసీపీ అధినేత జగన్ ఇంటి డాక్టర్‌గా పేరున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అలిగారు. ఎస్సీ సామాజిక వర్గంలో మేకతోటిని తొలగించాక.. తనకు అవకాశం దక్కుతుందని ఆమె బాగానే ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యంగా.. జగన్ తీసకువచ్చిన.. మూడు రాజధానుల విషయాన్ని బలంగా సమర్ధించిన.. ఉండవల్లి.. శ్రీదేవి.. అమరావతి విషయంలో తీవ్ర విమర్శలే చేశారు. ఇక్కడి రైతులతో సై.. అంటే సై అంటూ.. తల పడ్డారు. వారు చేస్తున్న ఉద్యమాన్ని.. పెయిడ్‌గా అభివర్ణించారు. అదేసమయంలో నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలు బయటకు రాకుండా.. అనేక సందర్భాల్లో కేసులు కూడా పెట్టించారు. ఇదంతా కూడా పార్టీలో తన పేరు మార్మోగేలా చేసిందనడంలో సందేహంలేదు.
ఎంత దూకుడుగా ఉంటే అంత మంచిదనే సూత్రాన్ని కొందరు నాయకులు అవలంభించినట్టుగానే ఉండవల్లి కూడా అనుసరించారు. కానీ,మంత్రి వర్గంలో చోటు లభించలేదు. దీంతో ఇప్పుడు ఆమె హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. కనీసం.. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. ఈ పరిణామాలను గ్రహించిన వైసీపీ అదిష్టానం.. ఆమెకు పరోక్షంగా కొన్నిసంకేతాలు పంపించింది. పార్టీని బలోపేతం చేస్తేనే.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని.. చెప్పేసిందట. అంతేకాదు.. అలక రాజకీయాలకు పార్టీ ఎట్టి పరిస్థితిలోనూ ప్రాధానన్యం ఇచ్చేది లేదని.. తెగేసి చెప్పినట్టు ఉండవల్లి వర్గం చెబుతోంది. దీంతో ఇప్పుడు.. ఆమె డోలాయమానంలో పడ్డారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 19, 2022 10:06 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…