Political News

జ‌గ‌న్ కేబినెట్ 2.0పై గంటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం జగన్ కొత్త కెబినేట్ 2.0పై టీడీపీ నేత, మాజీ మంత్రి, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే(రాజీనామా చేసినప్ప‌టికీ.. ఇంకా ఆమోదం పొంద‌లేదు) గంటా శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగిందని విమర్శంచారు. మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత కొరవడిందన్నారు. “ఇదేం మంత్రి వ‌ర్గం.. ఇదే కేబినెట్‌. ఇదంతా భ‌జ‌న ప‌రుల క్యాబినెట్‌. ఇదా సామాజిక స‌మ‌తుల్యం. ఇది మోసం చేయ‌డ‌మే. కేబినెట్ హ‌డావుడితో విలువైన వారంరోజుల స‌మ‌యాన్ని సుమారు కోటి రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని వృథా చేశారు” అని గంటా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కీల‌క నేత‌లు, పార్టీ అనుచ‌రులు, మాజీ మంత్రుల వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ విస్తరణ జరిగిందని విమర్శంచారు. విశాఖను రాజధాని అని చెప్తున్న ప్రభుత్వం.. నగరానికి కనీసం మంత్రిని లేకుండా చేశారని దుయ్యబట్టారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని.. కానీ వారికి మేలు చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీనే అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

జిల్లా విభజన కూడా సరిగా జరగలేదన్నారు. జిల్లా విభజన సమయంలో సీఎం తీరుతో సొంతపార్టీ నాయకులే చెప్పులతో కొట్టుకున్నారని గుర్తు చేశారు. కొత్త కెబినేట్ ఏర్పాటుతో వైసీపీలోను విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జగన్ తనని తాను బలమైన నాయకుడిగా చూపించుకున్నారని.. కానీ తాజా పరిస్థితులతో బలహీనమైన నాయకుడని నిరూపణ అయిందన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు లేద‌న్నారు. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న పాల‌న‌తో విసిగిపోయార‌ని చెప్పారు.

“ధ‌ర‌లు పెంచ‌న‌ని ఆయ‌నే చెప్పారు. ఇప్పుడు ధ‌ర‌లు పెంచారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కావాల‌ని.. ఆయ‌నే అన్నారు. 33 వేల ఎక‌రాల భూమి కావాల‌న్నారు. ఇప్పుడు అదే రాజ‌ధానిని ముంచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను దేవుళ్ల‌లా చూస్తాన‌ని చెప్పారు. రైతుల‌కు రాజన్య రాజ్యం చేరువ చేస్తాన‌ని అన్నారు.కానీ, ఇవేవీ.. సాకారం కావ‌డం లేదు. నియంత మాదిరిగా పాలిస్తున్నారు. ఇలాంటి.. పాలన కోస‌మేనా. ఒక్క ఛాన్స్ అని రోడ్లు ప‌ట్టుకు తిరిగారు?” అని గంటా ప్ర‌శ్నించారు. మ‌రి దీనిపై విశాఖ వైసీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.

This post was last modified on April 14, 2022 10:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

59 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago