ఏపీలోని జగన్ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై విమర్శలు గుప్పించారు. పన్నులను భారీగా పెంచి.. సామాన్యులపై మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పెంపును తీవ్రంగా ఖండించారు.
సీఎం జగన్ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
“జగన్ గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.”
“సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సు వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం.”
“ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలి.” అని లోకేష్ విమర్శలు గుప్పించారు.
మరోవైపు.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆయన ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలు, ఛార్జీల మోతలపై ఆరా తీశారు. ఇష్టానుసారం విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఉమకు వివరించారు. మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని ప్రభుత్వం అధోగతి పాలు చేసిందంటూ ఆయన విమర్శించారు.
ఇక, నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెంచుతూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని నెల్లూరు నగర టీడీపీ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ.. బాదుడే బాదుడు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్తు ఛార్జీల్ని పెంచడమే కాకుండా కరెంటు కోతలతో నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో తిరుగుతూ విసనకర్రలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. నెల్లూరుకి మాజీ మంత్రి అనిల్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
This post was last modified on April 13, 2022 2:56 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…