ఉమ్మడి చిత్తూరు జిల్లా చాలా పుణ్యం చేసుకుని ఉండాలి అందుకే ఆ జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చి జగన్ సర్ గౌరవించారు. ఇదే సమయంలో నెల్లూరుకు అన్యాయం జరిగిపోయింది. అనిల్ యాదవ్ ను తప్పించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోటంరెడ్డి కి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో కోటం రెడ్డి చాలా భావోద్వేగానికి లోనయ్యారు.
వైఎస్సార్ నాన్న పులివెందుల బిడ్డ రాజారెడ్డి మొదలుకుని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరకూ తాను ఏ విధంగా నడుకున్నానో చెప్పారు. అదేవిధంగా 2004 నుంచి 2019 వరకూ దఫదఫాలుగా జరిగిన ఎన్నికల్లో తాను ఏవిధంగా వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉన్నానో చెబుతూ…ఓ సైనికుడికి ఏం కావాలి రాజు ప్రోత్సాహం తప్ప అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక నెల్లూరుకు చెందిన అనిల్ కు కూడా పరాభవమే మిగిలింంది.
అసెంబ్లీలో బయట చంద్రబాబు తిట్టే మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పేరుకు సాగునీటి వ్యవహారాలు చూసే మంత్రి అయినా పవన్ పై సినిమా టిక్కెట్ల విషయమై చాలా కామెంట్లు చేసి ట్రోల్స్ కు గురయ్యారు. పోలవరం విషయమై చొరవ చూపలేకపోయారు. జగన్ దగ్గర మార్కులు కొట్టేయడం ఒక్కటే ధ్యేయంగా అదే పనిగా విపక్షాన్ని తిట్టిపోశారే కానీ మారుమూల ప్రాంతాలను పర్యటించి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం ఒక్కటంటే ఒక్కటీ చేయలేదు. ఇదే అనిల్ కు శాపం. ప్రధానమయిన అవలక్షణం అని కూడా రాయాలి.
ఇక సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి తెలివిగా తన మాట నెగ్గించుకుని శిష్యుడు నారాయణ స్వామికి మళ్లీ ఛాన్స్ దక్కేలా చేశారు. ఇదే సందర్భంలో జగన్ ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న రోజాను కూడా క్యాబినెట్ లో తీసుకున్నారు. ఆ లెక్కన ఉమ్మడి చిత్తూరు లో మూడు మంత్రి పదవులు దక్కడం ఓ విధంగా విశేషం. వైఎస్సార్సీపీ ఫైనాన్షియర్ గా పేరున్న పెద్ది రెడ్డి మాట జగన్ జవదాటరు అనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates