Political News

YCP: అసంతృప్త వాదంలో సీనియ‌ర్లు?

ప‌ద‌వులు పోతే ఏమౌతుంది ప‌రాజితులుగా పేరుండిపోతుంది. అస‌లు ఇలాంటి ఈక్వేష‌న్లే త‌ప్పు. చెరో రెండున్నర ఏళ్ల చొప్పున మంత్రి ప‌ద‌వి పంచుకోవాలి అని చెప్ప‌డ‌మే త‌ప్పు. గ‌తంలో ఇలాంటి రూల్ మేయ‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉండేది. మున్సిప‌ల్ చైర్మ‌న్ ను కానీ చైర్ ప‌ర్స‌న్ కానీ ఎన్నుకునే స‌మ‌యంలో ఉండేది. ఇప్పుడు ఈ రూల్ ను అప్లై చేసి ఎక్కువ మందికి ప‌ద‌వులు ఇవ్వాల‌ని ఆ విధంగా అసంతృప్త వాదాన్ని నిలువ‌రించాల‌ని సీఎం భావిస్తున్నారు.

కానీ సీనియ‌ర్లు అంతా ఒక‌ప్పుడు జ‌గ‌న్ వెంట న‌డిచి న‌డిచి ఇబ్బందులు ప‌డ్డ‌వారే ! ప్ర‌త్య‌ర్థుల కార‌ణంగా అవ‌మానాలు భ‌రించిన వారే ! క‌నుక ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చే ఛాన్స్ ఉంది. మంత్రి ప‌ద‌వి పోతే జిల్లాల‌లో హేళ‌న ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. విప‌క్షాలు తాజా మాజీల‌పై మరింత‌గా దాడి చేసే ఛాన్స్ ఉంది. అందుకే మంత్రి ప‌ద‌వి తీసేసినా క్యాబినెట్ ర్యాంకును కొనసాగించేలా, వివిధ కీల‌క ప‌ద‌వుల‌కు (పార్టీకి సంబంధించి) ఎంపిక‌చేసిన నాయ‌కులకు సంబంధిత గౌర‌వాన్ని వ‌ర్తింప‌జేసేలా ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఇక క్యాబినెట్ మినిస్ట‌ర్ వేరు క్యాబినెట్ ర్యాంకు ఉన్న హోదా వేరు అంటూ చాలా మంది ఇప్ప‌టికే బాహాటంగానే కామెంట్లు చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఏం చేసైనా మంత్రి ప‌ద‌వులు నిలుపుకుని తీరాల‌న్న ప‌తంలో ఉన్నారు. అంతేకాదు క‌ర్ణాట‌క‌కు చెందిన మినిస్ట‌ర్ల‌తో మాజీ మినిస్ట‌ర్ల‌తో కూడా లాబీయింగ్ న‌డుపుతున్నారు. ఏదీ కుద‌ర‌క‌పోతే పార్టీకి రాజీనామా చేసి విప‌క్ష స‌భ్యులుగా కొన‌సాగేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఈ మేర‌కు టీడీపీ నుంచి కొంత‌మంది వైసీపీ నాయ‌కుల‌కు ఆహ్వానాలు అందుతున్నాయి.

ఈ సారి క‌నుక మంత్రి ప‌ద‌వి రాకుంటే పార్టీ మారిపోవ‌డం బెట‌ర్ అన్న ఆలోచ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్ప‌టికే జ‌గ‌న్ తీసుకుంటున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో స్థానికంగా తాము నెగ్గుకు రాలేక‌పోతున్నామ‌ని ప‌లువురు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. అందుకే ఎలా అయినా ప‌దవే ధ్యేయంగా రామ‌కృష్ణా రెడ్డి ద‌గ్గ‌ర మంత‌నాలు జ‌రుపుతున్నారు. అప్ప‌టికీ నెగ్గుకు రాలేక‌పోతే తిరుగుబాటుకు కూడా తాము సిద్ధ‌మేన‌ని తేల్చేశారు చాలా మంది. గ‌తంలో బొత్స, క‌న్న‌బాబు లాంటి లీడ‌ర్లు జ‌గ‌న్ ను తిట్టిన వారే కనుక పాత కోపాలు మ‌ళ్లీ మ‌ళ్లీ వ్య‌క్తీక‌రించే ఛాన్స్ ఉంది. 

This post was last modified on April 9, 2022 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చివరిస్తానంలో హైదరాబాద్.. బయట ఫుడ్ తో జాగ్రత్త

హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…

1 hour ago

కొత్త లుక్ లో దర్శనం ఇచ్చిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…

2 hours ago

మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ

లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…

11 hours ago

ధనుష్ కోసం నయన్ ఫ్రీ సాంగ్

రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…

13 hours ago

విశ్వసుందరి కిరీటం విక్టోరియాకే.. ఇది మరో చరిత్ర!

ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…

13 hours ago

ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌వా రేవంత్‌!?

సండే ఈజ్ ఏ హాలీడే కాబ‌ట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్ర‌జ‌లంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజ‌కీయ‌ నాయ‌కులు మాత్రం…

14 hours ago