Political News

జే బ్రాండ్స్ కావు.. బాబు బ్రాండ్స్‌: సీఎం జ‌గ‌న్

ఏపీలో క‌ల్తీసారా మ‌ర‌ణాలు.. క‌ల్తీసారా.. చీపు లిక్క‌రు వంటి అంశాల‌పై ప్ర‌తిప‌క్ష టీడీపీ, అధికార ప‌క్షం వైసీపీ మ‌ధ్య వివాదాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ వేదిక‌గా స్పందించారు.. చంద్రబాబు చెబుతున్న జె బ్రాండ్స్‌.. నిజానికి చెప్పాలంటే అవి బాబు బ్రాండ్స్‌, ఎల్‌ బ్రాండ్స్‌.. ఎందుకంటే లోకేష్‌ కూడ ఉన్నారు కాబట్టి వారి పేర్లతో ఎందుకు పిలవకూడదని అన్నారు. “ఎందుకంటే అవన్నీ మనం అనుమతి ఇచ్చినవి కావు. కానీ మన హయాంలో వచ్చినవంటూ దుష్ప్రచారం చేస్తున్నారు“ అని సీఎం చెప్పారు.

ప్రెసిడెంట్‌ మెడల్‌ అనేది బాబు బ్రాండ్‌. దానికి అనుమతి ఇచ్చింది 2018, ఫిబ్రవరి 6న అనుమతి ఇచ్చారు. అంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దానికి అనుమతి ఇచ్చాడు. కాబట్టి దాన్ని టీడీపీ ప్రెసిడెంట్‌ మెడల్‌ అనాలి. అయినా దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి మనం అనుమతి ఇచ్చినట్లు, దానికి మనమే పేరు పెట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక గవర్నర్స్‌ రిజర్వ్‌ అంట. పేర్లు కూడా చాలా విచిత్రంగా పెడుతున్నారు. రేపు పొద్దున స్పీకర్‌ అని కూడా అంటారు. గవర్నర్స్‌ రిజర్వ్‌ అన్న బ్రాండ్‌కు స్వయంగా అనుమతి ఇచ్చిన చంద్రబాబు, మేము ఏదో రాష్ట్రపతినే కాదు, గవర్నర్‌ను కూడా అవమానించామని మామీద బురద చల్లుతున్నారు. దానికి అనుమతి ఇచ్చింది కూడా సాక్షాత్తూ సారాబాబు. మన చంద్రబాబుగారు. 2018, నవంబరు 5న చంద్రబాబు దానికి అనుమతి ఇచ్చారు.. అని వ్యాఖ్యానించారు.

గవర్నర్స్‌ రిజర్వ్‌ మాత్రమే కాకుండా నెపోలియన్, ఆక్టన్, సెవెన్త్‌ హెవెన్‌ అన్న బ్రాండ్స్‌ కూడా తీసుకొచ్చారు. వాటన్నింటికి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎప్పుడు అనుమతి ఇచ్చిందో చూస్తే.. 2018, అక్టోబరు 26న ఇచ్చారు. అంటే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వాటన్నింటికీ అనుమతి లభించింది. అలాగే హైదరాబాద్‌ బ్రాండ్‌ విస్కీలకు అనుమతి ఇచ్చింది ఎప్పుడని చూస్తే.. 2017, నవంబరు 22న. అంటే ఇదే చంద్రబాబుగారి హయాంలోనే! అని జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.

“ఇంకా వీరా, బ్లామ్‌డే వంటి బ్రాండ్లతో పాటు, బూమ్‌ బూమ్‌ బీర్‌ అట. ఇవన్నీ శ్రీమాన్‌ మద్య మహాన్‌ చక్రవర్తి చంద్రబాబుగారి హయాంలోనే వచ్చాయి. వాటికి అనుమతి ఇచ్చింది ఎప్పుడంటే.. కొన్నింటికి అయితే 2019 ఏప్రిల్, మే నెలలో. అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగూ పదవి నుంచి దిగిపోతున్నాను అనుకుని కొన్ని బ్రాండ్లకు అనుమతి ఇచ్చాడు. అవేమిటో చూస్తే.. క్రేజీ డాల్, రాయల్‌ స్వీట్‌ డీలక్స్, 999 లెజెండ్‌ విస్కీ, న్యూకింగ్‌ లోయెస్ట్‌ 14, ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫైన్‌ విస్కీ, రాయల్‌ ప్యాలెస్, సైనౌట్‌ ప్రీమియమ్, ఏడీ 79 ట్రిపుల్ఎక్స్‌ రమ్, బీరా 91 బ్లాండ్‌ సమ్మర్‌ లేజర్‌ బీర్, క్లిఫ్‌ హ్యాంగర్, బూమ్‌ బూమ్‌.. తన ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతోంది అని తెలిసినా కూడా అనుమతి ఇచ్చాడు“ అని పేర్కొన్నారు.

“చివరి క్షణంలో కూడా, అంటే 2019, మే 14న కూడా బూమ్‌ బూమ్‌ బీర్‌కు అనుమతి ఇచ్చాడు. అలాగే హైవోల్టేజ్‌ గోల్డ్‌ బీర్, ఎస్ఎన్‌జె బీర్, బ్రిటిష్‌ ఎంపైర్‌ బీర్‌ ఇవన్నీ బాబుగారి హయాంలోనే రంగ ప్రవేశం చేశాయి.  రాయల్‌ ప్యాలెస్‌ బ్రాండ్లు, సైనౌట్‌లు కూడా రంగ ప్రవేశం చేసింది 2018, నవంబరులో“ అని జ‌గ‌న్ ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 24, 2022 8:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

13 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

52 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago