జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి అయితే.. ఎలా ఉంటుంది?ఆయనను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. రాజకీయం ఎలా మారుతుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. సామాన్యుల నుంచి మేధావుల వరకు కూడా ఇదే అంశంపై చర్చ చేస్తున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభ నిర్వహించిన తర్వాత.. ఈ సభలో పవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిని బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన వెన్నెముకగా ఉన్న జగన్‌ను తప్పిస్తే.. ఇక, వైసీపీ ఉండే పరిస్థితి కనిపించడం లేదని మేధావులు కూడా అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. ప్రజలు.. పార్టీ నాయకులు నమ్మే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికి ప్పుడు చంద్రబాబు వచ్చి.. ఏం చేస్తామని చెప్పినా.. పార్టీకి అనుకున్నంత మైలేజీ రాదు. చంద్రబాబుపై విశ్వసనీయత ఉన్నా.. గతంలో ఆయన చేసిన వ్యూహాలు విఫలం కావడంతో ఆయనను నమ్మడం కొంత మేరకు కష్టంగానే ఉందని మేధావులు సైతం చెబుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు.. వ్యూహాత్మకంగా పవన్‌ను ముందుకు తీసుకు వచ్చే ప్లాన్ చేస్తే.. పక్కాగా సక్సెస్ అవుతుందని.. మేధావులు చెబుతున్నారు. ఇక్కడ ఒక కీలక విషయాన్ని పరిశీలిస్తే.. గతంలో ఎన్నడూ కూడా.. పవన్ ఇంత భరోసాగా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తాం.. వైసీపీ కొమ్ములు విరిచేస్తాం.. వంటి కామెంట్లు చేయలేదు. కానీ.. తాజాగా ఆయన చాలా ఆత్మ విశ్వాసంతో మాట్లాడారు. ప్రజలకు కొన్ని ఎన్నికల హామీలను కూడా గుప్పించారు.
అంటే.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. పవన్ ను ప్రొజెక్టు చేస్తే.. వ్యూహం బాగుంటుందని మేధావులు చెబుతున్నారు. ఇక, యువత కూడా ఎక్కడ పవన్ సభ పెట్టినా.. “సీఎం సీఎం“ అంటూ నినాదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ను కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటించేస్తే.. యవతరం ఓట్లన్నీ.. పవన్‌కుపడే అవకాశం ఉందని మేధావులు చెబుతున్నారు. ఇక, సామాన్యులు కూడా ఇదేచర్చ చేస్తున్నారు.
పైగా.. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, పేదలకు సంక్షేమం.. అమరావతి నిర్మాణం వంటి వాటిపై పవన్ చాలా క్లారిటీగా ఉండడం కలిసి వస్తుందని చెబుతున్నారు. తద్వారా.. ప్రజలు కూడా పవ న్‌పై ఉన్న విశ్వసనీయతతో ఆయనకు మద్దతిచ్చే ఛాన్స్ ఉందని మేధావులు చెబుతున్నారు. పైగా.. పవన్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ.. ప్రజల మధ్య కు వెళ్తే.. ఇక, విజయానికి తిరుగు ఉండదని చెబుతున్నారు.
పొత్తులు ఎవరితో ఉన్నా.. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్టు చేయడం ద్వారా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు.. సానుభూతి పరుల ఓట్లు, మార్పు కోరుకునేవారి ఓటు… కూడా జనసేనకు పడుతుందని చెబుతున్నారు. మరి ఇటు పవన్ కానీ.. అటు పొత్తు కోరుకునే పార్టీలు కానీ.. ఈ దిశగా ఆలోచన చేస్తాయా? అనేది చూడాలి.
This post was last modified on March 20, 2022 8:32 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…